Share News

Ruchi Slaps Producer: షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి

ABN , Publish Date - Jul 28 , 2025 | 08:04 AM

సో లాంగ్ వ్యాలీ సినిమా ప్రొడ్యూసర్‌ను ఓ నటి నలుగురిలో చెప్పుతో కొట్టిన ఘటన వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. తన డబ్బు తీసుకుని తిరిగివ్వకుండా డైరెక్టర్ మోసం చేశాడని నటి ఆరోపించింది.

Ruchi Slaps Producer: షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి
Ruchi Gujjar Slaps Producer

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో ఇటీవల ‘సో లాంగ్ వ్యాలీ’ మూవీ ప్రీమియర్ సందర్భంగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సినీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరణ్ సింగ్‌ను నటి రుచి గుజ్జర్ నలుగురిలో చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది.

వీడియోలో కనిపించినదాని ప్రకారం, మూవీపై నిరసన తెలిపేందుకు కొందరు అక్కడకు వచ్చి నినాదాలు చేశారు. వారితో పాటు వచ్చిన నటి రుచి తొలుత ప్రొడ్యూసర్‌లతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో కరణ్ సింగ్‌ను ఆమె చెప్పుతో కొట్టింది.

వివాదానికి మూలం ఇదీ..

కరణ్ సింగ్ గతేడాది తన వద్ద డబ్బు తీసుకుని ఆ తరువాత మోసం చేశాడని రుచి గుజ్జర్ ఆరోపించింది. ఓ ప్రాజెక్టు కోసం రూ.23 లక్షలు తీసుకున్నాడని చెప్పింది. ఓ హిందీ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కరణ్ తెలిపాడని ఆరోపించింది. అది సోనీ టీవీలో ప్రసారమవుతుందని చెప్పినట్టు వెల్లడించింది. ‘సహ నిర్మాతగా నన్ను చేర్చుకుంటానని అన్నాడు. నా కంపెనీ ఎస్‌ఆర్ ఈవెంట్స్ ఎంటర్‌టెయిన్మెంట్ ద్వారా పలు విడతల్లో డబ్బు చెల్లించా. కానీ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. డబ్బులు తిరిగిచ్చేయాలని అడిగినా అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ డబ్బును సో లాంగ్ వ్యాలీకి మళ్లించినట్టు నాకు ఆ తరువాత తెలిసింది. మళ్లీ నేను డబ్బులు తిరిగివ్వమని కోరితే అతడు బెదిరింపులకు దిగాడు’ అని ఆమె ఆరోపించింది.


ఈ విషయంలో కరణ్ సింగ్‌పై ఒషివారా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైనట్టు ముంబై పోలీసులు తెలిపారు. రుచి ఫిర్యాదు మేరకు గురువారమే ఎఫ్ఐఆర్ నమోదైందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాకపోయినా కరణ్ సింగ్ మాత్రం తనకు డబ్బు వెనక్కు ఇవ్వట్లేదంటూ ఆమె ఫిర్యాదు చేశారని అన్నారు. కరణ్ సింగ్‌‌పై మరో కేసు కూడా దాఖలు చేస్తామని నటి తరపు లాయర్ పేర్కొన్నారు.

ఇక రుచి తీరుపై మరో డైరెక్టర్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె పబ్లిసిటీ కోసం రచ్చ చేస్తోందని అన్నారు. తమ తాజా ఫిల్మ్ విడుదలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లినా కూడా ఆమెకు చుక్కెదురైందని అన్నారు. ‘రుచి, కరణ్ ఒకరికొకరు బాగా తెలుసు. ఆమె మూవీ కోసం కరణ్‌కు డబ్బు ఇచ్చినట్టైతే ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదు’ అని అన్నారు.


ఇవీ చదవండి:

భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

Read Latest and Viral News

Updated Date - Jul 28 , 2025 | 08:12 AM