Share News

Honesty in relationships: నిజాయితీగా ఉంటే బంధాలు బలపడతాయా.. సైకాలజిస్టులు ఏం తేల్చారంటే..

ABN , Publish Date - Mar 09 , 2025 | 05:12 PM

మనసులో ఉన్నదంతా జీవిత భాగస్వామితో పంచుకోవచ్చా? ఈ విషయంపై అధ్యయనం చేసిన సైకాలజీస్టుల ఏం చెబుతున్నారంటే..

Honesty in relationships: నిజాయితీగా ఉంటే బంధాలు బలపడతాయా.. సైకాలజిస్టులు ఏం తేల్చారంటే..
Honesty in Relationships

ఇంటర్నెట్ డెస్క్: ఏ బంధానికైనా నీతినిజాయతీలే పునాది. ఈ విషయంలో జంటలు మరింత శ్రద్ధ పెట్టాలి. మనసులో ఏదీ దాచుకోకుండా పంచుకుంటే చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. అపోహలు తొలగిపోతాయి. మనసులు మరింత దగ్గరవుతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో అవతలి వారికి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే గొడవలు కూడా వస్తాయి. చివరకు అవి చినికిచినికి గాలివానగా మారిన సందర్భాల్లో కూడా అందరికీ తెలిసిందే. మరి జీవత భాగస్వామితో నిజాయితీగా ఉండాలా వద్దా అని తేల్చుకోలేకపోతున్న వారికి సైకాలజిస్టులు సవివరమైన సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా ఓ అధ్యయనం నిర్వహించి దాని ఫలితాలు జనాలతో పంచుకున్నారు.


God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్

యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 200 మంది జంటల్ని పరిశీలించారు. నిజాయతీగా ఉన్న సందర్భాల్లో జంటల బంధం బలోపేతమైందా లేక బలహీనపడిందా అన్ని పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భాగస్వామితో నిజాయతీగా ఉండటంతో పాటు అవతలి వారు తమ మనసులో ఉన్నది నిజాయితీగా చెబుతున్నారన్న నమ్మకం కలిగినప్పుడు ఆ జంట బంధం బలపడినట్టు సంతోషంగా ఉన్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. నిజాయితీగా వ్యవహరించినప్పుడు అవతలి వారిలో సానుకూల మార్పులు రావడాన్ని కూడా గుర్తించారు. మనసులో ఉన్నది పూర్తిగా చెప్పకపోయినప్పటికీ అవతలి వారిని మన ప్రయత్నం కదిలిస్తే కూడా మంచి ఫలితాలు ఉన్నట్టు తేల్చారు. కాబట్టి, నిజాయితీగా ఉంటూనే అవతలి వారి మనసును కాయపరచకుండా నిజాలు చెప్పగలిగితే అసలైన ప్రయోజనం ఉంటుందని తేల్చారు.


Boss angry rants: ఆఫీసులో మీ భార్యకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ కోర్చోవద్దు.. నెటిజన్ పోస్టు వైరల్

కాబట్టి, అవతలి వారు తమతో నిజాయతీగా ఉన్నారన్న భావన ప్రధానంగా జంటలను దగ్గర చేస్తుందని అధ్యయనకారులు గుర్తించారు. అప్పుడప్పుడు మనసులో ఉన్న విషయాలను సూటిగా చెప్పకపోయినా పెద్ద ప్రమాదం ఉండదని తేల్చారు. కానీ, నిజాయితీగా ఉండేందుకు అవతలి వారు 100 శాతం ప్రయత్నిస్తున్నారన్న భావన కలిగితే జంటలు సగం విజయం సాధించినట్టేనని చెప్పారు. ఒక్కోసారి నిజాయితీగా వ్యవహరించినప్పుడు అవతలి వారు గాయపడ్డా దీర్ఘకాలంలో ఇదే వారి బంధాన్ని బలోపేతం చేస్తుందని కూడా గుర్తించారు.

Read Latest and Viral News

Updated Date - Mar 09 , 2025 | 05:12 PM