Share News

Black Panther And Leopards: అరుదైన వీడియో.. చిరుతపులులతో బ్లాక్ ప్యాంథర్ స్నేహం

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:03 PM

Black Panther And Leopards: 52 సెకన్ల వీడియోను కిశోర్ చంద్రన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేల లైకులు వచ్చాయి.

Black Panther And Leopards: అరుదైన వీడియో.. చిరుతపులులతో బ్లాక్ ప్యాంథర్ స్నేహం
Black Panther And Leopards

సాధారణంగా అడవి జంతువులు ఒక జాతితో మరో జాతి స్నేహంగా ఉండవు. దగ్గరకు రానివ్వడం మాట అటుంచి.. తమ భూభాగంలోకి అడుగుపెట్టినా కూడా గొడవకు దిగుతాయి. అందుకే రెండు జాతుల మధ్య స్నేహాలు ఉండవు. కానీ, కొన్ని సార్లు ఎవ్వరూ ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వేరు వేరు జాతులకు చెందిన మృగాలు స్నేహం చేస్తూ ఉంటాయి. తాజాగా, తమిళనాడులో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చిరుత పులులు, బ్లాక్ ప్యాంథర్ మధ్య స్నేహం ఏర్పడింది.


ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జులై 16వ తేదీన అర్థరాత్రి రెండు గంటల సమయంలో రెండు చిరుత పులులు, బ్లాక్ ప్యాంథర్ నీలగిరి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఊరిలోకి వచ్చాయి. సిమెంట్ రోడ్డుపై తిరుగుతూ ఉన్నాయి. చిరుత పులులు రోడ్డు చివరన నడుస్తూ ఉంటే.. బ్లాక్ ఫ్యాంథర్ రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంది. ఆ మూడు కలిసి ఆహారం కోసం వెతుకుతున్నట్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


52 సెకన్ల వీడియోను కిశోర్ చంద్రన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను చూశారు. వేల లైకులు వచ్చాయి. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మూడిటిని ఓకే చోట చూస్తుంటే అద్భుతంగా ఉంది. నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. వాటి రక్షణ గురించి ఆలోచించి లోకేషన్ పేరు చెప్పనందుకు ధన్యవాదాలు’..‘జైలర్ సినిమా క్లైమాక్స్ చూసినట్లు ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఐదేళ్ల కొడుకును ఎడారిలో బలివ్వడానికి సిద్ధమైన తల్లిదండ్రులు..

పృథ్వీ 2, అగ్ని 1 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం

Updated Date - Jul 18 , 2025 | 01:06 PM