Share News

Viral video: ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:13 PM

Rapido Driver: ఆ అమ్మాయి కానీ, ర్యాపిడో బైక్ డ్రైవర్ కానీ వెనక్కు తగ్గలేదు. గొడవపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ డ్రైవర్ ఎవ్వరూ ఊహించని పని చేశాడు. యువతి చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు.

Viral video: ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..
Rapido Driver

బెంగళూరు: ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావని అడిగినందుకు గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా యువతితో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. యువతి చెంపపై లాగిపెట్టి కొట్టాడు. దీంతో ఆ యువతి రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ర్యాపిడో బైకు ఆమె ఉండే చోటుకు వచ్చింది. యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే అక్కడి నుంచి కదిలింది. యువతి వెళ్లాల్సిన గమ్యస్థానం వెైపు వెళుతూ ఉంది. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత యువతి బైకు ఆపమంది. డ్రైవర్ తన ద్విచక్రవాహనాన్ని ఆపాడు. ‘నువ్వు చాలా ర్యాష్‌గా బైకు డ్రైవ్ చేస్తున్నావ్.. అసలు సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా వెళుతున్నావ్..’ అంటూ గొడవ పెట్టుకుంది.


కొద్దిసేపటికే గొడవ తారాస్థాయికి చేరింది. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు. జనం వారి చుట్టూ మూగారు. ఇద్దరికీ సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆ అమ్మాయి కానీ, ర్యాపిడో బైక్ డ్రైవర్ కానీ వెనక్కు తగ్గలేదు. గొడవపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ డ్రైవర్ ఎవ్వరూ ఊహించని పని చేశాడు. యువతి చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. దీంతో యువతి రోడ్డుపై పడిపోయింది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ర్యాపిడో బైక్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లపై చెయ్యి చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన మహిళ.. ఆ వ్యక్తి గుండెపై గన్నుపెట్టి..

ఇజ్రాయెల్ దాడుల వేళ అక్కడి భారతీయులకు కీలక సూచన

Updated Date - Jun 16 , 2025 | 04:04 PM