Rapido Driver Escorts Woman: మానవత్వం బతికే ఉంది.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:38 PM
ప్లాట్ కీస్ స్నేహితురాలి దగ్గర ఉండటంతో ఆ యువతి రోడ్డుపైనే నిలబడి పోవాల్సి వచ్చింది. అయితే, ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉండటంతో ఆమె భయపడింది.
రాత్రి వేళల్లోనే కాదు.. పగలు కూడా ఆడవారికి రక్షణ లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం. కొంతమంది కామాంధులు నడిరోడ్డులో కూడా ఆడవారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నిత్యం ఏదో ఒక సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సమాజంలో పరాయి ఆడవాళ్లకు అండగా నిలిచే మగాళ్లు కూడా ఉన్నారని తెలిపే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ర్యాపిడో బైక్ రైడర్ తన లేడీ కస్టమర్ రక్షణ కోసం ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు.
తన విలువైన సమయాన్ని వృధా చేసుకుని మరీ ఆమెకు కాపలా కాసాడు. ఇంతకీ సంగతేంటంటే.. ఓ యువతి నవరాత్రి గార్బా వేడుకల్లో పాల్గొని రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తనుండే చోటుకు ర్యాపిడోలో బయలు దేరింది. ప్లాట్ దగ్గరకు వచ్చే ముందు స్నేహితురాలికి ఫోన్ చేసింది. తాను ప్లాట్‌లో లేనని, మరికొద్దిసేపట్లో వస్తానని స్నేహితురాలు చెప్పింది. ప్లాట్ కీస్ స్నేహితురాలి దగ్గర ఉండటంతో ఆ యువతి రోడ్డుపైనే నిలబడి పోవాల్సి వచ్చింది. అయితే, ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉండటంతో ఆమె భయపడింది.
స్నేహితురాలు వచ్చే వరకు తనకు తోడుగా ఉండమని ర్యాపిడో అతడ్ని అడిగింది. అతడు సరేనన్నాడు. ఆమె స్నేహితురాలు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాతే అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ యువతి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ‘నేను గార్బా నైట్‌కు వెళ్లి వస్తున్నాను. ప్లాట్ కీస్ నా దగ్గర లేవు. నా ఫ్రెండ్ బయటకు వెళ్లింది. తను వచ్చే వరకు తోడు ఉండమని ర్యాపిడో వ్యక్తిని అడిగాను. అతడు సరేనన్నాడు. మానవత్వం ఇంకా బతికే ఉంది’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న
ఇవి కూడా చదవండి
చితి మంటల్లోని ఫ్రెండ్ శవంపై దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
రైలు ఎక్కి ఆధార్ చూపించిన వృద్ధురాలు.. అందరూ షాక్..