Share News

యువతిపై నెటిజన్లు ఫైర్.. కారణం ఏంటంటే

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:03 PM

Girl Rejects Govt Teacher: రేణు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంది. కుటుంబం ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగి సంబంధం తెచ్చింది. అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఉన్నాడు. అయితే, రేణు అతడ్ని కాదని ఇంటినుంచి పారిపోయింది.

యువతిపై నెటిజన్లు ఫైర్.. కారణం ఏంటంటే
Rajasthan Girl

అభినందన అనే తెలుగు సినిమాలో ఓ పాట ఉంటుంది.. ‘ ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు అంత కఠినం’ అని. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ప్రకారం అయితే దాన్ని మార్చి రాయాలి. ‘ ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు కూడా అంతే మధురం’ అని. ఎందుకంటే.. డబ్బుకు తప్ప.. బంధాలకు విలువ ఇవ్వని మనుషులు ఉన్న ఈ కలికాలంలో.. ఓ యువతి ఎంతో ఉన్నతంగా ప్రవర్తించింది. ప్రియుడి కోసం ఏకంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తిని కాదనుకుంది. ఇంట్లోంచి పారిపోయింది. బట్టల షాపులో పని చేసే ప్రియుడ్నే పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ ఉద్యోగిని కాదనడానికి ఆమె చెప్పిన కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ మొత్తం స్టోరీ చదివేయాల్సిందే మరి..


రాజస్తాన్లోని ద్వారా గ్రామానికి చెందిన రేణు అనే యువతి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంది. ఆమె గత కొంత కాలంగా అరవింద్ అనే యువకుడ్ని ప్రేమిస్తూ ఉంది. అరవింద్ స్థానికంగా ఓ బట్టల షాపులో పని చేస్తూ ఉన్నాడు. రేణు ఇంట్లో వాళ్లు కొద్దిరోజుల క్రితం ఆమెకు గవర్నమెంట్ టీచర్ సంబంధం తెచ్చారు. పెళ్లి నిశ్చయం అయింది. ఇంకో నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇలాంటి టైంలో రేణు ప్రియుడి కోసం ఇళ్లు వదిలిపెట్టి పోయింది. గవర్నమెంట్ టీచర్‌ను కాదని, బట్టల షాపులో పని చేసే ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఓ లోకల్ ఛానల్ వీరిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ.. ‘ నేను అరవింద్ రెండు సంవత్సరాల క్రితం కలుసుకున్నాం. స్నేహంగా మొదలైన మా పరిచయం ..


తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరం నేరుగా కలుసుకోవడానికి ముందు ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకునే వాళ్లం. ప్రేమ మొదలైన తర్వాత కలుసుకున్నాం. నాకు గవర్నమెంట్ టీచర్‌తో పెళ్లి నిశ్చయం అయింది. ఇంకో నెలలో పెళ్లి ఉండింది. నాకు అతడు నచ్చలేదు. నేను గవర్నమెంట్ జాబ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే .. డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అంటారు. అందుకే ఇంట్లోంచి పారిపోయి అరవింద్‌ను పెళ్లి చేసుకున్నాను. అరవింద్ నాకు ఏం కావాలి అని అడిగాడు. నాకు నువ్వు తప్ప ఏమీ వద్దని చెప్పాను’ అని అంది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను పొగుడుతున్నారు. ప్రియుడితో పెళ్లి కోసం ఇంత డ్రామా అవసరమా? అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

Inter 2025 Results: శనివారం ఇంటర్ ఫలితాలు

Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్

Updated Date - Apr 11 , 2025 | 01:03 PM