Share News

Model Chai Wali: అమ్మాయని కూడా చూడలేదు.. మరీ దారుణంగా..

ABN , Publish Date - Jun 10 , 2025 | 08:30 AM

Model Chai Wali: గిరాకీ బాగా ఉండటంతో సిమ్రాన్ రాత్రి 12 దాటినా షాపును తెరిచే ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు షాపు తెరిచి ఉంచొద్దని అన్నారు.

Model Chai Wali: అమ్మాయని కూడా చూడలేదు.. మరీ దారుణంగా..
Model Chai Wali

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా సెలెబ్రిటీ, టీ షాపు ఓనరైన ఓ అమ్మాయిపై పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. ఓ లేడీ పోలీస్ అర్ధరాత్రి వేళ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించింది. అమ్మాయి డ్రెస్ పట్టుకుని స్టేషన్‌కు లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన సిమ్రాన్ అనే యువతి ‘మోడల్ చాయ్ వాలీ’ పేరిట ఓ టీ స్టాల్ నిర్వహిస్తోంది.


సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. ప్రతీ రోజూ టీ షాపునకు జనం పెద్దసంఖ్యలో వస్తూ ఉన్నారు. గిరాకీ బాగా ఉండటంతో సిమ్రాన్ రాత్రి 12 దాటినా షాపును తెరిచే ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను హెచ్చరించారు. అర్ధరాత్రి వరకూ షాపు తెరిచి ఉంచొద్దని అన్నారు. అయితే, పోలీసుల మాటల్ని సిమ్రాన్ పట్టించుకోలేదు. ఆదివారం నాడు అర్ధరాత్రి వరకూ షాపు తెరిచే ఉంచింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది.


వెంటనే అక్కడికి వెళ్లారు. ఓ లేడీ పోలీస్ సిమ్రాన్ దగ్గరకు వెళ్లి.. షాపు మూసేసి స్టేషన్‌కు రమ్మంది. భయపడిపోయిన సిమ్రాన్ రానంది. ఆ లేడీ పోలీస్ బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. సిమ్రాన్ మొండికేసింది. దీంతో ఆ లేడీ పోలీస్ సిమ్రాన్ దుస్తులు పట్టుకుని ఈడ్చుకెళ్లడానికి చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రాజా మర్డర్.. వైరల్‌గా మారిన పెళ్లి వీడియో..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

Updated Date - Jun 10 , 2025 | 09:03 PM