Share News

PIB Fact Check: ఈ రోజు నేషనల్ హాలిడే అంటూ వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

ABN , Publish Date - Jun 06 , 2025 | 07:11 AM

PIB Fact Check: కేంద్రం జూన్ 6వ తేదీన దేశ వ్యాప్త సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పీఐబీ దానిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

PIB Fact Check: ఈ రోజు నేషనల్ హాలిడే అంటూ వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..
PIB Fact Check

ఇంటర్ నెట్ వాడకం ఎక్కువైన తర్వాత సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. నేడు మీడియాతో సమానంగా సోషల్ మీడియా కమ్యూనికేషన్‌ను సాగిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వాస్తవాలకంటే అసత్యాలే ఎక్కువ ప్రచారం అవుతూ ఉన్నాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో కనుక్కోవటం కష్టంగా మారింది. పుకార్ల కారణంగా కొన్ని సార్లు పెద్ద సంఖ్యలో జనం తప్పుదోవ పట్టే అవకాశం ఉంటోంది. అందుకే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రచారాలపై ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో ప్రజలకు చెబుతూ ఉంది. తాజాగా, సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతున్న నేషనల్ హాలిడేపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఆ ప్రచారం ఫేక్ అని తేలింది. ఇంతకీ సంగతేంటంటే.. కేంద్రం జూన్ 6వ తేదీన దేశ వ్యాప్త సెలవు ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఏముందంటే.. ‘శుక్రవారం, జూన్ 6వ తేదీన నేషనల్ పబ్లిక్ హాలిడే ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, కొన్ని రాష్ట్రాలకు ఈ హాలిడే వర్తిస్తుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఛత్తీష్‌ఘర్, పంజాబ్, రాజస్తాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది’ అని ఉంది. ఈ వైరల్ ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత పీఐబీ నిన్న ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.‘ఆ వార్తలు ఫేక్. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు’ అని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

ఔరా కుబేర

Updated Date - Jun 06 , 2025 | 07:31 AM