51 cars gifted: ఇలాంటి బాస్ దొరికితే చాలా లక్కీ.. ఉద్యోగులకు అతడిచ్చిన దీపావళి గిఫ్ట్స్ ఏంటంటే..
ABN , Publish Date - Oct 21 , 2025 | 01:54 PM
భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూసే పండుగ దీపావళి. ఈ వెలుగుల పండగ ఎన్నో సంబరాలను మోసుకొస్తుంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను అదిరిపోయే బహుమతులతో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి.
భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూసే పండుగ దీపావళి. ఈ వెలుగుల పండగ ఎన్నో సంబరాలను మోసుకొస్తుంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను అదిరిపోయే బహుమతులతో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ దీపావళి గిఫ్ట్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది (Diwali bonus 2025).
కొందరు తమ బాస్‌లు ఇచ్చిన లగ్జరీ గిఫ్ట్‌ల గురించి వర్ణిస్తుంటే, మరికొందరు కనీసం స్వీట్ బ్యాక్స్ కూడా ఇవ్వని విషయం చెప్పి బాధపడుతున్నారు. ఆ బాధను రెట్టింపు చేసే మరో దివాళీ గిఫ్ట్స్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చండీగఢ్‌కు చెందిన మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ బాస్ ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అతడు తన కంపెనీ ఉద్యోగులకు ఏకంగా 51 కార్లు అందించారు. ఫార్మా కంపెనీ అయిన మిట్స్ గ్రూప్ అధినేత ఎమ్‌కే భాటియా తన సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 51 మంది ఉద్యోగులకు స్కార్పియో కార్లను అందించారు (employee gifts cars).
భాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు (Indian employer bonus). వాస్తవానికి అతను తన ఉత్తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడో సంవత్సరం కావడం విశేషం. 'నేను వారిని ఎప్పుడూ ఉద్యోగులుగా చూడను. వారు మా ప్రయాణాన్ని నిజమైన బ్లాక్‌బస్టర్‌గా మార్చారు. కొన్ని కార్లు ఇప్పటికే వచ్చాయి. మరికొన్ని త్వరలో వస్తున్నాయి' అని భాటియా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..
చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..