Share News

Viral Video: ఏనుగు మసాజ్ చేస్తే ఇలానే ఉంటుంది మరి..

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:39 PM

Viral Video: ఏనుగులు భారీ కాయంతో ఉంటాయి. కొంచెం అటు,ఇటు అయినా మనిషి ప్రాణాలు పోవటమో.. ఎముకలు విరగటమో జరుగుతుంది. కానీ, ఆ ఏనుగు మాత్రం ఆమెకు ఎలాంటి హాని కలగకుండా అద్భుతంగా మసాజ్ చేసింది.

Viral Video: ఏనుగు మసాజ్ చేస్తే ఇలానే ఉంటుంది మరి..
Viral Video

తెలివైన జంతువుల్లో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి. అందుకే అవి మనుషులతో ఎంతో ప్రేమగా ప్రవర్తిస్తాయి. ఒకసారి ఓ వ్యక్తిని ఇష్టపడ్డాయంటే.. ప్రాణం పోయే వరకు వారిని గుర్తుపెట్టుకుంటాయి. ఏనుగులు తమ తెలివితో మనుషులు చేసే చాలా పనులు చేయగలవు. మీరు పెయింటింగ్ వేసే ఏనుగుల గురించి వినే ఉంటారు. ఇప్పుడు మసాజ్ చేసే ఏనుగు గురించి తెలుసుకోండి. ఏనుగేంటి?.. మసాజ్ చేయడం ఏంటి? అని అనుకోకండి. ఓ ఏనుగు మహిళకు మసాజ్ చేసింది.


సాధారణంగా ఏనుగులు భారీ కాయంతో ఉంటాయి. కొంచెం అటు,ఇటు అయినా మనిషి ప్రాణాలు పోవటమో.. ఎముకలు విరగటమో జరుగుతుంది. కానీ, ఆ ఏనుగు మాత్రం ఆమెకు ఎలాంటి హాని కలగకుండా అద్భుతంగా మసాజ్ చేసింది. కొద్దిసేపు తొండంతో మసాజ్ చేసింది. ఆ తర్వాత కాలితో కూడా మసాజ్ చేసింది. ఎంతో ఓర్పుగా.. ఎంతో నేర్పుగా ఆ ఏనుగు మసాజ్ చేసింది. దాని పనితనం చూస్తుంటే.. ఓ వెయ్యి రూపాయలు టిప్ ఇచ్చినా పర్లేదు అనిపిస్తుంది.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ వీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఏనుగు మసాజ్ చేయటం నేనెప్పుడూ చూడలేదు. వినను కూడా లేదు. ఆ ఏనుగు మాత్రం అద్భుతంగా మసాజ్ చేస్తోంది’..‘నేను కూడా ఓ సారి ఆ ఏనుగుతో మసాజ్ చేయించుకోవాలి. అడ్రస్ ఎక్కడో పెట్టండి ప్లీజ్’..‘ఆ ఏనుగుతో మసాజ్ చేయించుకోవాలంటే ఎంత చెల్లించాలి’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి

పాపం వృద్ధులు.. అలా చేయడానికి మనసెలా వచ్చింది..

లక్నో స్టార్‌పై సంచలన ఆరోపణలు.. 11 మంది మహిళలతో..!

Updated Date - Jun 27 , 2025 | 10:01 PM