Parenting: అలర్ట్.. తల్లిదండ్రులు తెలీక చేసే ఈ పొరపాట్లే పిల్లల్లో మొండితనం పెంచుతాయ్!
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:51 PM
పిల్లల పెంపకంలో కొన్ని తప్పులతో వారిలో మొండితనం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇతరుల భావాద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యాలు కొరవడతాయని తెలిపారు. పట్టువిడుదల ధోరణితో పాటు అవసరమైనప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టగలిగితే వారి బంకరు భవిష్యత్తుకు బాటలు వేసినట్టు అవుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు లైఫ్‌లో విజయం సాధించాలని, సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించాలని ఏ తల్లితండ్రులైనా కోరుకుంటారు. అయితే, ఈ విజయాలకు బీజం తల్లిదండ్రుల పెంపకంలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల పెంపకంలో తెలీక జరిగే కొన్ని పొరపాట్లు వారిని మొండివారిగా, తమ స్వార్థం మాత్రమే చూసుకునే వారిగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు (Parenting).
తమ భావాలను అర్థం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ఇందుకు పిల్లలు కూడా అతీతులు కారు. కానీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల మాటలను అంతగా పట్టించుకోరు. వారి సమస్యలను చిన్నవిగా, అప్రధాన్యమైనవిగా కొట్టిపారేస్తారు. తమ గోడు వినేవాళ్లు లేని సందర్భాల్లో పిల్లల్లో మొండితనం, పెంకితనం పెరిగే అవకాశం ఉందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Parenting Tips: పేరెంటింగ్ పిల్లల్లో ఆధ్యాత్మికత ఇలా...
చిన్న పిల్లలు కోరే గొంతెమ్మ కోర్కెలన్నిటికీ యస్ చెప్పడం కూడా డేంజరే. దీంతో, పిల్లల్లో అంతా తమ ఇష్టప్రకారం జరగాలనే మనస్తత్వం పెరుగుతుంది. తనకు ఏ నిబంధనలూ వర్తించవన్నట్టు, అవతలి వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమే లేదన్నట్టు మారిపోతారు. పెద్దయ్యాక కూడా ఈ తీరు వారిలో కొనసాగే ప్రమాదం ఉంది.
పిల్లలు పెద్దల మాట వినకపోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు సహనం నశించి వారిని దండించే ప్రయత్నం చేయొచ్చు. వీపుపై ఒక్కటిచ్చుకోవచ్చు. అయితే, ఇలాంటి శిక్ష వల్ల ఫలితం ఉన్నట్టు మొదట అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం చేటే ఎక్కువ జరుగుతుందని చిన్నారుల మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో మొండితనం పెరగడంతో పాటు వారికి తల్లిదండ్రులపై నమ్మకం పోయే పరిస్థితి వస్తుందట. తల్లిదండ్రులకు సహకరించి వారు చెప్పినట్టు నడుచుకోవాలన్న భావన తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Parenting Tips: మీ పిల్లలు మీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారా? ప్రధాన కారణాలు ఇవే!
నేటి కాలం తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లలు నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీవీలు, వీడియో గేమ్స్, ఇతర వ్యావహాళి ఆటలతో వారిని ఎప్పుడూ ఎంటర్‌టెయిన్ చేయాలని చూస్తున్నారు. ఇది కూడ అంతమంచిది కాదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, పిల్లలకు తమని తాము కూడదీసుకునే అవకాశాలను ఇవ్వాలని, ఇలాంటి వాటితో చిన్నారుల్లో క్రమశిక్షణ, స్వేచ్ఛ, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు.
Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..