Actress Humaira Asghar: 10 నెలలుగా అద్దెకట్టని నటి.. గది తలుపు తెరిచి చూడగా..
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:52 PM
Actress Humaira Asghar: పోలీసులు హుమైరా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె చనిపోయి రెండు వారాలు అవుతోందని తేలింది. లోపలినుంచి తలుపు వేసి ఉండటంతో.. హుమైరా మరణం మిస్టరీగా మారింది.

ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్గర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అద్దె ఇంట్లో ఆమె శవమై తేలింది. బాగా కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు ఆమె శవాన్ని గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి హుమైరా అస్గర్ గత కొన్నేళ్లుగా కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ.. ఫేస్ 6లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. 2024 సెప్టెంబర్ నెల నుంచి ఆమె అద్దె చెల్లించటం లేదు. ఎంత అడిగినా అద్దె డబ్బులు ఇవ్వకపోవటంతో ఇంటి యజమాని కోర్టుకు వెళ్లాడు.
తాజాగా, కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో పోలీసులను వెంట బెట్టుకుని హుమైరా ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఇళ్లు ఖాళీ చేయిద్దామని అనుకున్నాడు. అయితే, వారు అక్కడికి వెళ్లగానే విపరీతమైన దుర్వాసన రాసాగింది. పోలీసులకు అనుమానం వచ్చింది. రెండు, మూడు సార్లు తలుపుకొట్టి.. హుమైరాను పిలిచారు. లోపలినుంచి ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే తలుపు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ కుళ్లిన స్థితిలో ఆమె శవం కనిపించింది.
పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె చనిపోయి రెండు వారాలు అవుతోందని తేలింది. లోపలినుంచి తలుపు వేసి ఉండటంతో.. హుమైరా మరణం మిస్టరీగా మారింది. హుమైరా తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె దాదాపు ఏడేళ్లనుంచి ఒంటరిగానే జీవిస్తోందని విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి
తప్పతాగి.. నడిరోడ్డుపై పోలీసులతో గొడవ..
రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..