Share News

Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..

ABN , Publish Date - Feb 15 , 2025 | 07:11 AM

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వస్తువులను డెలివరీ చేస్తుండడంతో వినియోగదారులు చాలా వరకు ఆన్‌లైన్ షాపింగ్‌నే ఇష్టపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.

Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..
Cheating in Online Shopping

ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసేస్తున్నారు. మొబైల్‌లో చూసి నచ్చినది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసేస్తే చాలు కొద్ది రోజుల్లోనే ఆ వస్తువు మన ఇంటి వద్దకు వచ్చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వస్తువులను డెలివరీ చేస్తుండడంతో వినియోగదారులు చాలా వరకు ఆన్‌లైన్ షాపింగ్‌నే ఇష్టపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. (Cheating in Online Shopping)


ఒడిశా (Odisha)లోని సంబల్‌పూర్‌లోని హాస్పిటల్ రోడ్‌లో నివసించే ఒక డాక్టర్ ఫిబ్రవరి 4న ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ నుండి ల్యాప్‌టాప్ (Laptop) ఆర్డర్ చేశాడు. దాని విలువ అక్షరాలా 61 వేల రూపాయలు. డెలివరీ అందిన తర్వాత అతను ప్యాకేజీని తెరిచి చూసి షాకయ్యాడు. ఎందుకంటే ప్యాకేజీ లోపల అతడికి ల్యాప్‌టాప్‌కు బదులుగా, తెల్లటి పాలరాయి ముక్క మాత్రమే ఉంది. రూ.61 వేలు తీసుకుని ఓ పాలరాయి ముక్క రావడం చూసి అతను నిర్ఘాంతపోయాడు. వెంటనే సదరు ఈ-కామర్స్ కంపెనీని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. అయితే సదరు వెబ్‌సైట్ నుంచి అతడికి సంతృప్తికర సమాధానం రాలేదు.


ఆ డాక్టర్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్యాకింగ్ సెంటర్‌లో పొరపాటు జరిగిందా లేదా డెలివరీ సమయంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ల్యాప్‌టాప్ స్థానంలో రాయి పెట్టారా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఆ డాక్టర్‌కు న్యాయం జరుగుతుందా? లేదా అనే చూడాలి.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2025 | 07:11 AM