Share News

Indian Railways: ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:11 PM

ఏసీ బోగీలో కూడా చెప్పులు చోరీ కావడంతో ఓ ప్యాసెంజర్ షాకయ్యారు. ఖరీదు పెట్టి ఏసీ టిక్కెట్లు కొనే ధనవంతులు కూడా చేతివాటం ప్రదర్శిస్తుంటారా? అని వాపోయారు. నెట్టింట ఆ ప్యాసెంజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Indian Railways: ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..
Slippers Theft in 2 Tier AC Coach Indian Railways

ఇంటర్నెట్ డెస్క్: రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు లగేజీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్నా ఈ జాగ్రత్త తప్పదు. లేకపోతే ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తనకు రైల్లో ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ఏసీ కోచ్‌లల్లో ప్రయాణించే జనాలూ ఇలా చేస్తారని తాను ఊహించలేదని కామెంట్ చేశారు (Slippers Stolen in AC 2 Tier Coach Indian Railways).

ఇటీవల పాటలీపుత్ర నుంచి బెంగళూరుకు రైల్లో వస్తున్నప్పుడు తనకు ఈ అనుభవం ఎదురైందని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. తాను ఏసీ 2 టైర్ కోచ్‌లో జర్నీ చేసినట్టు తెలిపారు. రాత్రి హ్యాపీగా నిద్రపోయి మరునాడు లేచే సరికి తన చెప్పులు కనిపించకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా పొరపాటున నా చెప్పులు వేసుకుని వెళ్లిపోయారో లేక కావాలనే దొంగతనం చేశారో అర్థం కావట్లేదు. ఆ చెప్పుల ఖరీదు రూ. 2 వేలు. రైలు దిగాక నేను ఉత్తకాళ్లతో నడవాలి. తలుచుకుంటే నవ్వొస్తోంది. కాస్తంత చికాకుగా కూడా ఉంది. అయినా అంత ఖరీదు పెట్టి 2ఏసీ రైలు టిక్కెట్టు కొనగలిగే వారు మరీ ఇలా కక్కుర్తి పడతారా?’ అని ప్రశ్నించారు.


ఇక ఈ పోస్టుకు నెట్టింట సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోచ్ ఏదైనా సరే రైళ్లల్లో ఇలాంటి అనుభవాలు తప్పవని కొందరు కామెంట్ చేశారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా ఎవరో తన హెడ్‌ఫోన్స్ చోరీ చేశారని ఓ నెటిజన్ తెలిపారు. ఏకంగా ట్యాబ్స్ చోరీ అయిన ఘటనలు కూడా ఉన్నాయని కొందరు అన్నారు. ‘రైళ్లల్లో ఇచ్చే బెడ్‌షీట్స్ చోరీ చేసేందుకు అలవాటు పడ్డ జనాలు చెప్పులు ఎత్తుకు పోయేందుకు ఎంత మాత్రం సందేహించరని ఓ వ్యక్తి సెటైర్ పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

2.jpg


ఇవీ చదవండి:

వందేభారత్ స్లీపర్.. గాస్లు నిండా నీరు.. చుక్క నీరు కూడా ఒలకలేదుగా!

వామ్మో ఐఫోన్.. తుఫానులో చిక్కుకుపోయి.. 3 రోజుల తరువాత చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 16 , 2025 | 07:23 PM