Share News

Viral Video: పిచ్చి పీక్స్.. నిద్రలేమికి మరీ ఇంత దారుణమైన ట్రీట్‌మెంటా..

ABN , Publish Date - May 30 , 2025 | 04:39 PM

Insomnia Cure Treatment: ఇలా తలను ఊయలలాంటి దానికి కట్టుకుని ఊగడాన్ని ‘ నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్’ అంటారట. ఓ వ్యక్తి దీన్ని తన వ్యాపారంగా మార్చుకున్నాడు. నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. చేతినిండా సంపాదిస్తున్నాడు.

Viral Video: పిచ్చి పీక్స్.. నిద్రలేమికి మరీ ఇంత దారుణమైన ట్రీట్‌మెంటా..
Insomnia Cure Treatment

నేడు ప్రపంచ వ్యాప్తంగా 10 శాతానికిపైగా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. క్లీవ్‌లాండ్ క్లినిక్ కథనం ప్రకారం.. ప్రతీ ముగ్గురు యువకుల్లో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోయిన తర్వాత నిద్రలేమి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. నిద్రలేమి కారణంగా పగటి పూట నిద్రరావటం, అలసట, పని మీద శ్రద్ధ లేకపోవటం వంటి సమస్యలు వస్తాయి. నిద్రలేమి మరింత ఎక్కువైతే అది మెదడు పని తీరు మీద ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.


డయాబెటిస్, హైబీపీలు వచ్చే అవకాశం ఉంది. చైనాలో కూడా పెద్ద ఎత్తున జనం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆ దేశంలో 15 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. షెన్‌యాంగ్ పట్టణంలోనూ జనం పెద్ద సంఖ్యలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి జనం వింత, విచిత్రమైన చికిత్స మొదలుపెట్టారు. తమ తలను ఊయలలాంటి దానికి కట్టుకుని ఊగుతున్నారు. ప్రతీ రోజూ ఇలా కొన్ని నిమిషాల పాటు ఊగటం వల్ల తమ సమస్య తగ్గిందని నిద్రలేమి బాధితులు చెబుతున్నారు.


ఇలా తలను ఊయలలాంటి దానికి కట్టుకుని ఊగడాన్ని ‘ నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్’ అంటారట. ఓ వ్యక్తి దీన్ని తన వ్యాపారంగా మార్చుకున్నాడు. నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. సదరు నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్ సెంటర్‌ యజమాని మాట్లాడుతూ.. ‘ నేను వెన్ను సమస్య, తలనొప్పి, నిద్రలేమితో బాధపడేవాడ్ని. నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్ కారణంగా నా సమస్యలు అన్నీ దూరం అయ్యాయి’ అని అన్నాడు. ఇక, నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియో మొదటి సారి 2025, ఏప్రిల్ 21వ తేదీన ఏజెడ్ పోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్‌లో విడుదల అయింది. నెల రోజుల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

వాట్సాప్ నుంచి కొత్త అప్‎డేట్.. మీ డేటా లాస్ కాకుండా..

Updated Date - May 30 , 2025 | 05:18 PM