Viral video: రూ.500 నోట్ల కట్టలు దొంగిలించిన కోతి.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:55 PM
Monkey Snatches 500 Notes: మొదటగా ఓ కట్టని కిందపడేసింది. తర్వాత రెండో కట్టలోంచి డబ్బుల్ని రెండు భాగాలుగా పీకేసింది. ఓ భాగాన్ని చెట్టుపై పడేసింది. రబ్బర్ ఉన్న రెండో భాగం నుంచి నోట్లను పీకి పడేసింది.

కోతుల్లో దొంగ కోతులు కూడా ఉంటాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేస్తూ ఉంటాయి. తినే వస్తువులా కాదా అని కూడా చూసుకోవు. అన్నిటిని దొంగిలించేస్తుంటాయి. దొంగిలించిన వస్తువుల్ని వదలాలంటే.. తినే వస్తువుల్ని ఇచ్చి తీరాల్సిందే. ఉత్తర ప్రదేశ్‌లోని వ్రిందావనంలో దొంగ కోతులు చాలా ఎక్కువ. అక్కడికి వచ్చే భక్తుల దగ్గరినుంచి వస్తువుల్ని దొంగిలిస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే, ఫర్ ఏ ఛేంజ్ తమిళనాడులోని ఓ కోతి టూరిస్ట్ కొంపముంచబోయింది. అతడి వద్దనుంచి 500 రూపాయల నోట్ల కట్టల్ని దొంగిలించింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. తమిళనాడులోని కొడైకెనాల్‌లో పర్యటిస్తున్న ఓ టూరిస్ట్ దగ్గరినుంచి ఓ కోతి 500 రూపాయల నోట్ల కట్టల్ని దొంగిలించింది. వాటిని తీసుకున్న వెంటనే ఓ చెట్టు మీదకు ఎక్కింది. టూరిస్ట్ దాంతో పాటు చెట్టు దగ్గరకు పరుగులు తీశాడు. ఆ కోతి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది.
మొదటగా ఓ కట్టని కిందపడేసింది. తర్వాత రెండో కట్టలోంచి డబ్బుల్ని రెండు భాగాలుగా పీకేసింది. ఓ భాగాన్ని చెట్టుపై పడేసింది. రబ్బర్ ఉన్న రెండో భాగం నుంచి నోట్లను పీకి పడేసింది. కొన్ని నోట్లు కొమ్మల మధ్యలో ఇరుక్కున్నాయి. మరికొన్ని కిందపడిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో.. టూరిస్టు ఆ డబ్బుల్ని తీసుకున్న దృశ్యాలు మాత్రం లేవు. అయితే, కొడైకెనాల్‌లో కోతులు టూరిస్టులను తరచుగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఫార్ములా ఈ రేస్ కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ
రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..