Share News

Mayor Marries Crocodile: మొసలిని పెళ్లాడిన మేయర్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:19 AM

Mayor Marries Crocodile: హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు.

Mayor Marries Crocodile: మొసలిని పెళ్లాడిన మేయర్.. కారణం ఏంటంటే..
Mayor Marries Crocodile

మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవటం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. జాతకంలో దోషాలు ఉన్నపుడు.. అది కూడా పెళ్లి సమయంలో దోష నివారణ కోసం ఇలా మనుషులు.. జంతువుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ, మెక్సికో దేశంలో ఓ వింత ఆచారం ఉంది. మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకోవటం తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఇది పెళ్లి విషయంలో దోష నివారణం కోసం అయితే కాదు.


మెక్సికో, శాన్‌పెడ్రోలోని హ్యూమలూలాలో 230 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం ఉంది. అక్కడి మగవారు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలా చేయటం వల్ల వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని, మత్స్య సంపద బాగుంటుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఏటా మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.


తాజాగా, హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత మేయర్.. తన భార్య మొసలిని ముద్దులతో, హగ్గులతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

మాలీలో దారుణం.. భారతీయుల్ని అపహరించిన టెర్రరిస్టులు

చర్మంపై మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ కూరగాయ రసంతో చెక్ పెట్టండి..

Updated Date - Jul 03 , 2025 | 11:37 AM