Massive Explosion: అత్యంత భారీ పేలుడు.. కిలోమీటర్ వరకు ప్రభావం
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:38 PM
Massive Explosion: ఇరాన్‌లోని షాహిద్ రాజాయి పోర్టులో అత్యంత భారీ పేలుడు సంభవించింది. పోర్టులోని కొన్ని కంటైనర్లు పేలటం వల్ల ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇరాన్‌లో అత్యంత భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఏకంగా 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. శనివారం సాయంత్రం షాహిద్ రాజాయి పోర్టులో ఈ పేలుడు చోటుచేసుకుంది. దాదాపు ఒక కిలోమీటర్ మేర పేలుడు ప్రభావం కనిపించింది. పోర్టులోని కొన్ని కంటైనర్లు పేలటం వల్ల ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో పేలుడు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. నల్లటి పొగ కొన్ని వందల మీటర్ల వరకు కప్పేసింది.
నాలుగైదు కిలోమీటర్ల వరకు శబ్ధం
పోర్టులో సంభవించిన పేలుడు తీవ్రత ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్ధం వినిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో 400 కంటే ఎక్కువ మంది పోర్టులో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అగ్ని మాపక దళాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నాలుగు అత్యవసర రెస్పాన్స్ టీములు కూడా అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇరాన్‌లో ఉన్న అత్యంత ఆధునికమైన పోర్టు ఇది. అలాంటి పోర్టులో ఈ సంఘటన జరగటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
Barmer Bridegroom: భారత్- పాక్ సరిహద్దు దగ్గరకు ఊరేగింపుగా వరుడు.. ఊహించని షాకిచ్చిన ఆర్మీ..
Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..