Guinness World Record: ఆయన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే..
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:09 PM
1965లో జన్మించిన ఈయనగారు.. 25వ ఏట తన పేరును 2వేల కంటే ఎక్కువ పదాలకు పెంచు కోవాలని నిర్ణయించుకున్నారట. దాంతో 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. స్థానిక జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే, విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించారు.
- పేరుతో గిన్నిస్ రికార్డు సాధించాడు...
మామూలుగా ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని కొన్ని సెకన్లలో చెప్పేస్తాం. కానీ న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ వాట్కిన్స్ తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. తీరిగ్గా టిఫిన్ కూడా చేసేయొచ్చు. ఎందుకంటే ఆ పేరు పలకడానికి సుమారు 20 నిమిషాలు పడుతుందట. అంటే ఎంత పే....ద్దదో ఊహించుకోవచ్చు.
1965లో జన్మించిన ఈయనగారు.. 25వ ఏట తన పేరును 2వేల కంటే ఎక్కువ పదాలకు పెంచు కోవాలని నిర్ణయించుకున్నారట. దాంతో 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. స్థానిక జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే, విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించారు. అయినా వెనక్కి తగ్గకుండా హైకోర్టులో అప్పీల్ చేశాడు. విచారణ అనంతరం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడడంతో తన పేరును 2,253 పదాలకు పెంచుకున్నాడు.

‘గిన్నిస్ రికార్డ్‌ల కోసం కొంతమంది చేసే విచిత్రమైన, అసాధారణమైన విషయాలు నన్ను బాగా ఆకర్షించాయి. అందుకే నేనూ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పాలనుకున్నా. ఎవరైనా తమ పేరు గిన్నిస్ రికార్డుల్లో ఉండాలని అనుకుంటారు. కానీ నేను మాత్రం నా పేరుతోనే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలను కున్నా. నా స్నేహితులు, సహోద్యో గుల సాయంతో నా పేరును పొడిగించుకున్నా. లాటిన్, ఇంగ్లీష్ పేర్లతో పాటు ప్రముఖ వ్యక్తుల పేర్లు, ‘నేమ్ యువర్ బేబీ’ పుస్తకం, ‘మావోరీ’ నిఘంటువు నుంచి మరికొన్ని పేర్లను సేకరించి నా పేరుకు జత చేసుకున్నా. నన్ను ఇప్పుడు చాలామంది ‘ఏ టూ జెడ్ 2000’ అని పిలుస్తున్నారు’ అని చెబుతూ మురిసిపోతున్నాడీ వ్యక్తి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
కష్టాల కడలి దాటి.. పుట్టగొడుగులతో కోటీశ్వరుడైన వ్యక్తి
Read Latest Telangana News and National News