Share News

Man Barely Stands Amid Hurricane: వీడు మామూలోడు కాదు.. తుఫాను గాలికి ఎదురెళ్లాడు..

ABN , Publish Date - Oct 27 , 2025 | 03:45 PM

జారి కిందపడుతున్నా సరే అతడు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. పైకి లేచి మళ్లీ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాదాపు 30 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Man Barely Stands Amid Hurricane: వీడు మామూలోడు కాదు.. తుఫాను గాలికి ఎదురెళ్లాడు..
Man Barely Stands Amid Hurricane

ఫ్రాన్స్‌లో బెంజమిన్ తుఫాను బీభత్సం సృష్టించింది. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను గాలులు అలజడి రేపాయి. జన జీవనం అస్తవ్యస్తం అయింది. బెంజమిన్ తుఫాను తీవ్రతను తెలిపే ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి కొండపై ఉన్నాడు. తుఫాను గాలి (Storm Benjamin Winds) కారణంగా అతడు వెనక్కు కొట్టుకుపోతూ ఉన్నాడు. ముందుకు నడవటానికి ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా అతడి వల్ల కావటం లేదు. తుఫాను గాలి బలంగా అతడ్ని వెనక్కు నెట్టేస్తూ ఉంది.


జారి కిందపడుతున్నా సరే అతడు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. పైకి లేచి మళ్లీ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాదాపు 30 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ సంఘటన ఫ్రాన్స్‌లోని పుయ్ డే లా టాచే పర్వతంపై జరిగినట్లు తేలింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ప్రముఖ ఫొటోగ్రాఫర్ థామస్ సౌలెట్‌గా(Thomas Soullet Adventure Photograph) గుర్తించారు. సెంట్రల్ ఫ్రాన్స్‌లోని వాతావరణ పరిస్థితులపై డాక్యుమెంటరీ తీద్దామని అతడు పర్వతంపైకి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే తుఫాను గాలిలో చిక్కుకు పోయాడు.


మరో సంఘటనలో..

ఫ్రాన్స్‌లో అలజడి సృష్టించిన బెంజమిన్ తుఫాను కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. గత గురువారం తుపాను గాలుల( France Hurricane-Force Wind) కారణంగా కార్సికా ఐలాండ్‌లో 45 ఏళ్ల ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నదిలో ఈత కొడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తుఫాను గాలి భారీ ఎత్తున ఒక్కసారిగా రావటంతో ఆ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అతడు మాత్రం నీటిలో మునిగి చనిపోయాడు.


ఇవి కూడా చదవండి

మీ పిల్లలు ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లు తింటుంటారా.. ముందు ఈ విషయం తెలుసుకోండి..

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే..

Updated Date - Oct 27 , 2025 | 03:47 PM