Share News

Viral Video: మరీ ఇంత దారుణమా.. ప్లై ఓవర్ ఓపెన్ అయి వారం కూడా కాలేదు కదరా..

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:38 AM

Kids Stealing Nuts Bolts: జూన్ 11వ తేదీన 422 కోట్లతో నిర్మితమైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ ప్రారంభం అయింది. జూన్ 13వ తేదీన ఆ ఫ్లై ఓవర్ మీదకు ఐదుగురు పిల్లలు వెళ్లారు. వారంతా కలిసి ఫ్లైఓవర్‌కు సంబంధించిన నట్లు, బోల్ట్‌లు తీయటం మొదలెట్టారు.

Viral Video: మరీ ఇంత దారుణమా.. ప్లై ఓవర్ ఓపెన్ అయి వారం కూడా కాలేదు కదరా..
Kids Stealing Nuts Bolts

బీహార్‌లో కొంతమంది పిల్లలు బరి తెగించారు. కొత్తగా ప్రారంభం అయిన ఫ్లైఓవర్‌కు కన్నం వేయడానికి చూశారు. ఏకంగా ఫ్లైఓవర్‌కు సంబంధించిన నట్లు, బూట్లు దొంగలించడానికి చూశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పాట్నాలో జూన్ 11వ తేదీన 422 కోట్లతో నిర్మితమైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ ప్రారంభం అయింది. జూన్ 13వ తేదీన ఆ ఫ్లై ఓవర్ మీదకు ఐదుగురు పిల్లలు వెళ్లారు. వారంతా కలిసి ఫ్లైఓవర్‌కు సంబంధించిన నట్లు, బోల్ట్‌లు తీయటం మొదలెట్టారు.


అలా కొన్ని నట్లు, బోల్ట్‌లు తీశారు. ఇంతలో ఓ వ్యక్తి అటు వైపు వచ్చాడు. పిల్లలు బోల్ట్‌లు విప్పటం చూశాడు. వెంటనే వారిని అడ్డుకున్నాడు. దీంతో భయపడిపోయిన వాళ్లు నట్లు, బోల్ట్‌లు అక్కడే పెట్టి పరుగున వెళ్లిపోయారు. ఆ వ్యక్తి పిల్లలు అక్కడినుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను వీడియో తీశాడు. దాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘జూన్ 11వ తేదీన పాట్నాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ఈ పిల్లలు నట్లు, బోల్టులు తీస్తూ కనిపించారు.


వాళ్లు స్థానికుల్లా కనిపించటం లేదు. బంగ్లాదేశీయులు అయిఉండొచ్చు’ అని రాసుకొచ్చాడు. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఆ పిల్లల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి’.. ‘ఆ పిల్లలు ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. లేదంటే రేపు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు’..‘నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.. వీళ్లను చూస్తే దొంగలు అయ్యేలా ఉన్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టాలెంట్ చూపిస్తున్న మొసలి పిల్ల..

సార్.. నా పోస్టుమార్టం ఆపండి.. పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు..

Updated Date - Jun 15 , 2025 | 11:42 AM