Share News

Viral Video: వరదలో చిక్కి మూడు గంటల పాటు నరకం

ABN , Publish Date - Jun 28 , 2025 | 09:58 PM

Viral Video: ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.

Viral Video: వరదలో చిక్కి మూడు గంటల పాటు నరకం
Viral Video

దేశ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదలు పోటెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేరళలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి కారణంగా వలచల్ ఏరియాలోని చలకుడి నది కూడా పొంగి పొర్లింది. ఆ నదీ ప్రవాహంలో చిక్కి ఓ ఏనుగు నరకం చూసింది. 3 గంటల పాటు ఎటూ కదల్లేక అల్లాడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ఏనుగు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయింది. పాపం అది ఏటూ వెళ్లలేక ఇబ్బందిపడుతోంది. ప్రాణ భయంతో అల్లాడిపోయింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ ఏనుగు కొంచెం ఏమరపాటుగా ఉన్నా నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 3 గంటల పాటు అక్కడినుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. 3 గంటల సుధీర్ఘ కష్టం తర్వాత అది అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయింది.


ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు వరదల కారణంగా అడవిలోని జంతువులకు ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

Updated Date - Jun 28 , 2025 | 10:01 PM