Share News

Ambulance: ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..

ABN , Publish Date - Jun 14 , 2025 | 08:25 PM

భారీ ట్రాఫిక్‌లో అంబులెన్స్ డ్రైవర్ అద్భుతంగా డ్రైవ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Ambulance: ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..
Ambulance Viral Video

ఇంటర్నెట్ డెస్క్: అంబులెన్స్ డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు. ఎంతటి ట్రాఫిక్‌లో అయినా చాకచక్యంగా డ్రైవ్ చేస్తూ పేషెంట్‌ను సకాలంలో ఆసుపత్రికి చేర్చాల్సిన బాధ్యత అంబులెన్స్ డ్రైవర్లపై ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలపై నిర్లక్ష్యం ప్రదర్శించే వాహనదారులు ఉన్న భారత్‌లో అంబులెన్స్ డ్రైవర్లకు విధి నిర్వహణ కత్తిమీద సామే. కానీ ఈ పనిని శభాష్ అనేలా చేసి చూపించాడో అంబులెన్స్ డ్రైవర్. అతడి డ్రైవింగ్ తీరు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ అద్భుత అంబులెన్స్ డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. డాష్ క్యామ్‌లో ఈ వీడియో రికార్డు అయ్యింది. ఇందులో డ్రైవర్ అంబులెన్స్‌ను భారీ ట్రాఫిక్‌లో కూడా సునాయసంగా నడిపాడు. అడ్డుగా ఉన్న వాహనాలను అత్యంత చాకచక్యంగా తప్పించుకుని డ్రైవ్ చేశాడు. అసలేమాత్రం కంగారు లేకుండా గాల్లో తేలుతున్నట్టు దూసుకెళ్లిపోయాడు. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా ఎప్పటికప్పుడు అంబులెన్స్‌కు దారి ఇచ్చాయి. సైరెన్ మోగించుకుంటూ వెళ్లడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కూడా అంబులెన్స్ ఆపాల్సిన అవసరం లేకపోయింది. ఇతర డ్రైవర్లు కూడా అంబులెన్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించారు. పౌర స్పృహతో తమ బాధ్యతను నిర్వహిస్తూ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.


ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ అద్భుత దృశ్యం కేరళలోనిదని అన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజెన్‌ల విషయంలో మలయాళీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, 99 శాతం వాహనదారులు ఇవి కనిపించిన వెంటనే దారి ఇస్తారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, మానవత్వం ఒకేసారి ఆవిష్కృతమైన అద్భుత దృశ్యమని కామెంట్ చేశారు.


ఇక ఈ వీడియోకు నెటిజన్లు కూడా బ్రహ్మరథం పట్టారు. కేరళ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఆ రాష్ట్రం భూతల స్వర్గం అని కొందరు అన్నారు. మరికొందరు అంబులెన్స్ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. అతడు అద్భుతంగా డ్రైవ్ చేశాడని కామెంట్ చేశారు. మరికొందరు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. చాలా చోట్ల వాహనదారులు అంబులెన్స్ వస్తున్నా నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ

భారతీయులు మరింత పౌర స్పృహతో మెలగాలి.. పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా

Read Latest and Viral News

Updated Date - Jun 14 , 2025 | 09:19 PM