Share News

Viral Video: తల్లీ నీ ధైర్యానికి సెల్యూట్.. చెట్టు మీద ఆ డ్యాన్స్ అదుర్స్ కానీ..

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:00 PM

Viral Video: గత కొద్దిరోజుల నుంచి చెట్టుపైకి ఎక్కి డ్యాన్సులు చేయటం.. అందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేయటం చేస్తోంది. అయితే, ఆరు రోజుల క్రితం ఆమె పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉషా ఆ వీడియోలో చెట్టు ఎక్కి.. బాలీవుడ్ పాట ‘ జల్లా వల్లా’కు డ్యాన్స్ చేసింది.

Viral Video: తల్లీ నీ ధైర్యానికి సెల్యూట్.. చెట్టు మీద ఆ డ్యాన్స్ అదుర్స్ కానీ..
Viral Video

పిచ్చి పలు రకాలు అని ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగు ఉంటుంది. కొంతమంది జనాలను చూస్తే.. పిచ్చి పట్టి అలా చేస్తున్నారా? మూర్ఖులా.. అన్న సంగతి అస్సలు అర్థం కావటం లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న దురుద్దేశంతో కొంతమంది ప్రాణాలను కూడా లెక్కచేయటం లేదు. భరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ అవ్వాలన్న పిచ్చితో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా, ఓ మహిళ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్రాణాలను గాల్లో నిలబెట్టింది. ఏకంగా చెట్టు పైకి ఎక్కి డ్యాన్స్ చేసింది. చాలా ఎత్తులో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.


ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాశ్మీర్‌కు చెందిన ఉషా నాగవంశీ అనే యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. ఆమె తనకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ యువతికి ఓ టాలెంట్ ఉంది. చెట్టు పైకి ఎక్కి డ్యాన్స్ చేయగలదు. గత కొద్దిరోజుల నుంచి చెట్టుపైకి ఎక్కి డ్యాన్సులు చేయటం.. అందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేయటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరు రోజుల క్రితం ఆమె పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఉషా ఆ వీడియోలో చెట్టు ఎక్కి.. బాలీవుడ్ పాట ‘ జల్లా వల్లా’కు డ్యాన్స్ చేసింది. ఇన్‌స్టాలో వైరల్ అయిన ఆ రీల్‌కు మిలియన్ల కొద్ది వ్యూస్.. లైకులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో జనం కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ మీకు అద్భుతమైన టాలెంట్ ఉంది మేడమ్.. మీరు గ్రేట్’..‘ మీ టాలెంట్ చూపించడానికి భూమ్మీద చోటే చిక్కలేదా?’.. ‘ ఈ సారి టార్గెట్ బుర్జ్ ఖలీఫా’..‘ చెట్టు మీద ఆ డ్యాన్స్ అదుర్స్.. కానీ, కాలు జారితే నీ ప్రాణాలు పోతాయి’.‘ అక్క.. మీకు ఏ టైటిల్ కావాలని ఇలా ప్రాణాలకు తెగించి డ్యాన్స్ చేస్తున్నారు’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

Pakistan Water Problem: భారత్ యాక్షన్.. పాకిస్తాన్ గిల గిల

Massive Explosion: అత్యంత భారీ పేలుడు.. కిలోమీటర్ వరకు ప్రభావం

Updated Date - Apr 26 , 2025 | 07:00 PM