Share News

Phone Slips Into Water: నీటిలో పడ్డ ఫోన్.. ఆ యువకుడి పరిస్థితి వర్ణణాతీతం

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:56 PM

Phone Slips Into Water: జైపూర్‌లో రామ్‌నివాస్ భాగ్‌లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు మోకాలి వరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. సుభాష్ చౌక్‌కు చెందిన హల్‌థర్ అనే యువకుడు స్కూటీపై ఆ రోడ్డుపైకి వచ్చాడు.

Phone Slips Into Water: నీటిలో పడ్డ ఫోన్.. ఆ యువకుడి పరిస్థితి వర్ణణాతీతం
Phone Slips Into Water

ఉత్తర భారత దేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, నదులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఇక, నగరాల్లో అయితే, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. రోడ్ల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. వరద నీటితో నదులను తలపిస్తున్నాయి. జలమయం అయిన రోడ్డుపై ప్రయాణం ఓ యువకుడి కొంపముంచింది. స్కూటీపై వెళుతుండగా అతడి ఫోన్ నీటిలో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ వర్షం కురిసింది. రామ్‌నివాస్ భాగ్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాదాపు మోకాలి వరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. సుభాష్ చౌక్‌కు చెందిన హల్‌థర్ అనే యువకుడు స్కూటీపై ఆ రోడ్డుపైకి వచ్చాడు. నీటితో నిండిన రోడ్డుపై స్కూటీ నడుపుతూ ఉండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అతడి ఫోన్ పొరపాటున నీటిలో పడిపోయింది. ఫోన్ నీటిలో పడిపోయిందని గ్రహించగానే.. స్కూటీ ఆపేశాడు.


ఫోన్ పడ్డ దగ్గరకు వెళ్లి వెతకటం మొదలెట్టాడు. అయితే, ఎంత వెతికినా కూడా ఫోన్ దొరకలేదు. దీంతో యువకుడికి కన్నీళ్లు ఆగలేదు. రోడ్డుపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. చేసేది ఏమీ లేక అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అధికారులు చేసిన తప్పుకు ఆ యువకుడు శిక్ష అనుభవించాడు. పాపం అతడ్ని చూస్తుంటే జాలేస్తోంది’..‘ఆ యువకుడిని ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో వంకాయలు.. ఆరోగ్యానికి మంచివేనా?

ప్రముఖ సీరియల్ నటిపై భర్త కత్తి దాడి

Updated Date - Jul 11 , 2025 | 05:12 PM