Share News

Jabalpur Lady Gang Abducts: సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి..

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:02 PM

ముగ్గురు మహిళలు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు అమ్మాయిల్నికిడ్నాప్ చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Jabalpur Lady Gang Abducts: సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి..
Jabalpur Lady Gang Abducts

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పోగొట్టుకోవటమో.. ఇతరుల ప్రాణాలు తీయటమో చేస్తున్నారు. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో అత్యంత కిరాతకమైన సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు రెచ్చిపోయి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటం కోసం అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ అమ్మాయిలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చేసిన పాపం పండి ఆ నిందితురాళ్లు జైలు పాలయ్యారు.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్, గ్వారీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు మహిళలు ఓ గ్రూపుగా మారి నేరాలకు పాల్పడుతున్నారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురు మహిళలు ఇద్దరు యువతుల్ని కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. తర్వాత వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి అమ్మాయిల్ని దారుణంగా కొట్టారు. దాడిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో సైతం పోస్టు చేశారు.


ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఓ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన మహిళలపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితురాళ్లను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ఆ ముగ్గురు మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారు తరచుగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

బంగారు చెవి కమ్మలు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

Updated Date - Nov 23 , 2025 | 04:14 PM