Facts about Scorpion: శ్వాస తీసుకోకుండా 6 రోజులు.. ఆహారం లేకుండా ఏడాది.. తేలు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:07 PM
తేలు ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా జీవించగలదట. తేలుకు ఆ శక్తి ఉండడానికి కారణం దాని శ్వాసకోశ వ్యవస్థ. తేలు ఊపిరితిత్తులు పుస్తకపు పేజీల తరహాలో ముడుచుకొని ఉంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఈ భూమి మీద నివసించే చాలా జీవులు ఆహారం లేకుండా అయినా కొన్ని రోజులు గడపగలవేమో, కానీ శ్వాస తీసుకోకుండా మాత్రం మనుగడ సాగించలేవు. మనుషులు అయితే శ్వాస (Breath) తీసుకోకపోతే నిమిషాల వ్యవధిలోనే మరణిస్తారు. అయితే తేలుకు (Scorpion) మాత్రం కొన్ని అరుదైన లక్షణాలు ఉన్నాయి. తేలు అంటే ఓ విషపూరిత జీవి మాత్రమే గుర్తుకొస్తుంది. అయితే తేలు ఓర్పు, దాని శక్తి గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే (Interesting Facts about Scorpion).
తేలు ఆరు రోజులు శ్వాస తీసుకోకుండా జీవించగలదట. తేలుకు ఆ శక్తి ఉండడానికి కారణం దాని శ్వాసకోశ వ్యవస్థ. తేలు ఊపిరితిత్తులు (Book Lungs) పుస్తకపు పేజీల తరహాలో ముడుచుకొని ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల్లో గాలిని నిల్వ చేసుకుంటుంది. దీని కారణంగా, ఆక్సిజన్ అందనప్పుడు కూడా, తేలు తన ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలితో జీవించగలదు. అలాగే తేలు ఒక సంవత్సరం మొత్తం ఆహారం లేకుండా జీవించగలదు. నీటిని కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. అత్యంత క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకుని తేలు మనుగడ సాగించగలదు.
అడవులు, ఎడారులు, రాళ్ల మధ్యలో.. ఇలా ప్రతి చోటా తేలు జీవించగలదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తేలు చర్మంపై అతినీలాలోహిత కాంతి కిరాణాలు పడినప్పుడు అది మెరుస్తుంది. మన దేశంలో కనిపించే ఇండియన్ రెడ్ స్కార్పియన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేళ్లలో ఒకటి. ఈ తేలు కుడితే ఎవరైనా 72 గంటలలోపు చికిత్స తీసుకోవాలి. లేకపోతే మరణం సంభవించడం ఖాయం. ఈ తేలు మన దేశంలోనే కాకుండా.. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చింపాంజీ కళ్లజోడు ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..