Share News

Lamborghini Catches Fire: నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:06 PM

Lamborghini Catches Fire: కారు బ్యాక్ సైడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతడు కారును రోడ్డుపైనే ఆపేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కారులో మంటలు చెలరేగటం చూసిన జనం సంజయ్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Lamborghini Catches Fire: నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు
Lamborghini Catches Fire

ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చెందిన ఖరీదైన కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ కారులో మంటలు ఆర్పడానికి నీళ్లు, ఇసుకతో చాలా సేపు కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఆ మంటలు ఆగిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ సంఘటన బెంగళూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సంజీవ్ అనే వ్యక్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.


ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అతడ్ని 2 లక్షల మంది ఫాలో అవుతున్నారు. సంజయ్ దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. వాటిలో 10 కోట్ల రూపాయల లంబోర్గినీ అవెన్‌టడార్ కూడా ఒకటి. సంజయ్ తన పది కోట్ల కారులో శనివారం సాయంత్రం రోడ్డుపై వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కారు బ్యాక్ సైడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతడు కారును రోడ్డుపైనే ఆపేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కారులో మంటలు చెలరేగటం చూసిన జనం సంజయ్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.


ఇసుక, నీళ్లతో మంటల్ని ఆర్పటం మొదలెట్టారు. కొన్ని నిమిషాల పాటు కష్టపడ్డ తర్వాత మంటలు ఆగిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కారు కొంచెం మాత్రమే పాడైంది. అయితే, కారులో మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏంటో తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య

Updated Date - Aug 03 , 2025 | 08:23 PM