Home remedy to infant: చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 07:21 AM
నెలల పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోతే వంటింటి చిట్కాలను ఆశ్రయించకూడదు. జలుబు, దగ్గు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. వారికి స్వంత వైద్యం మొదలుపెడితే చాలా పెద్ద ప్రమాదం జరగొచ్చు. చెన్నైలో ఓ కుటంబంలో అలాంటి విషాదమే జరిగింది.

సాధారణంగా మనం చిన్నపాటి జలుబు, తలనొప్పికి జండూబామ్ లేదా విక్స్ (Vicks) మొదలైనవి ఇంటి దగ్గరే రాసుకుంటూ ఉంటాం. పెద్ద వారి సంగతి పక్కన పెడితే, నెలల పిల్లల (Infant) విషయంలో మాత్రం ఎలాంటి వంటింటి చిట్కాలనూ (home remedies) ఆశ్రయించకూడదు. జలుబు, దగ్గు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. వారికి స్వంత వైద్యం మొదలుపెడితే చాలా పెద్ద ప్రమాదం జరగొచ్చు. చెన్నై (Chennai)లో ఓ కుటుంబంలో అలాంటి విషాదమే జరిగింది. ఇంట్లో వాళ్లు వంటింటి చిట్కాను ఉపయోగించడంతో 8 నెలల చిన్నారి ఏకంగా ప్రాణాలనే కోల్పోయింది.
చెన్నైలోని అభిరామపురం ప్రాంతానికి చెందిన దేవనాథన్ అనే వ్యక్తికి 8 నెలల పాప ఉంది. ఆ చిన్నారి గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు విక్స్‌లో కాస్త పచ్చ కర్పూరం కలిపి ఆ చిన్నారి ముక్కుకు పూశారు. కాసేపటికి ఆ చిన్నారికి సరిగ్గా శ్వాస ఆడకపోవడంతో ఆపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆ చిన్నారిని స్థానిక ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు.
ఆ చిన్నారి హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఆ చిన్నారి మృతికి విక్స్, కర్పూరం కలిపి రాయడమే కారణమా? లేదా ఇంకేదైనా వ్యాధి ఉందా అనేది శవ పరీక్షలో తేలుతుంది. కాగా, కొన్ని వంటింటి చిట్కాలు పలు సమస్యలను తగ్గిస్తాయని, అయితే చిన్న పిల్లలకు వాటిని అప్లై చేసే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. కళ్లెదురుగానే విచిత్రం.. క్షణాల్లో గేటు ఎలా మాయమైందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చెట్టుపై ఉన్న గుడ్లగూబను 8 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..