Share News

Indore Man Installs CCTV: తలపై సీసీ కెమెరా.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:46 PM

Indore Man Installs CCTV: ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను సైతం ధ్వంసం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. పోలీసులను ఆశ్రయించినా వారు సరిగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే సతీష్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. హెల్మెట్‌కు సీసీ కెమెరా బిగించి తలకు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు.

Indore Man Installs CCTV: తలపై సీసీ కెమెరా.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
Indore Man Installs CCTV

‘పిచ్చోళ్ల గురించి వినటమే కానీ, లైవ్‌లో ఇదే చూడ్డం’ అని ఓ సినిమా డైలాగు ఉంటుంది. ఈ డైలాగు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని వ్యక్తి బాగా సరిపోతుంది. ఎందుకంటే.. ఆ వ్యక్తి తలపై సీసీ కెమెరా పెట్టుకుని తిరుగుతున్నాడు. సీసీ కెమెరా ఎందుకు పెట్టుకున్నావ్ అని అంటే.. ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఎందుకు అతడు తలకు సీసీ కెమెరా పెట్టుకుని తిరుగుతున్నాడో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్య ప్రదేశ్, ఇండోర్‌లోని గౌరీ నగర్‌కు చెందిన సతీష్ చౌహాన్‌కు పొరిగిళ్లకు చెందిన బలిరామ్ చౌహాన్, మున్నా చౌహాన్‌లతో గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. బలిరామ్, మున్నా దౌర్జన్యంగా తన ఆస్తి కాజేయాలని చూస్తున్నారని సతీష్ అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రతీ రోజూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. గత కొద్దిరోజుల నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారింది. రెండు రోజుల క్రితం బలిరామ్, మున్నాలు సతీష్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారందరినీ చావగొట్టారు.


ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను సైతం ధ్వంసం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. పోలీసులను ఆశ్రయించినా వారు సరిగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే సతీష్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. హెల్మెట్‌కు సీసీ కెమెరా బిగించి తలకు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒక వేళ వాళ్లు దాడి చేస్తే.. సాక్ష్యాల కోసం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఉపయోగపడతాయని సతీష్ భావిస్తున్నాడు. ప్రస్తుతం సతీష్ తలకు సీసీ కెమెరాతో తిరుగుతున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మొదట అతడ్ని చూడగానే పిచ్చోడు అనిపించింది. నవ్వు వచ్చింది. అతడి స్టోరీ తెలుకున్న తర్వాత బాధేసింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇరాన్ ఊహించని నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు గడ్డు కాలమే..

హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

Updated Date - Jul 13 , 2025 | 01:51 PM