Share News

Annabelle Doll: ఎంతో మందిని భయపెట్టిన దెయ్యం బొమ్మ గల్లంతు..

ABN , Publish Date - May 25 , 2025 | 07:05 PM

Annabelle Doll: ఈ బొమ్మ గదిలోకి వచ్చిన తర్వాతి నుంచి అంతా భయంకరంగా మారిపోయింది. వింత వింత సంఘటనలు జరగటం మొదలైంది. బొమ్మ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలేది.

 Annabelle Doll: ఎంతో మందిని భయపెట్టిన దెయ్యం బొమ్మ గల్లంతు..
Annabelle Doll

అనబెల్ డాల్.. ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనబెల్ బొమ్మపై ఆంగ్ల చిత్ర పరిశ్రమలో ఎన్నో భయానక చిత్రాలు వచ్చాయి. కంజురింగ్ సిరీస్, అనబెల్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యాద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ అన్ని చిత్రాల్లో అనబెల్ బొమ్మ ప్రధానంగా ఉంటుంది. ఈ బొమ్మ చిత్రాల్లోనే కాదు.. బయట కూడా చాలా మందిని భయపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ బొమ్మ అమెరికా, కనెక్టికట్‌లోని వారెన్స్ మ్యూజియంలో ఉండేది.


దాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళుతూ ఉంటారు. అయితే, గత కొద్దిరోజుల నుంచి ఆ బొమ్మ వస్తు ప్రదర్శన శాలలో కనిపించటం లేదు. అక్కడికి వెళ్లిన వారికి ఆ బొమ్మ కనిపించకపోవటంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అనబెల్ బొమ్మపై చర్చ జరుగుతోంది. ఆ బొమ్మ లూసియానా నుంచి ప్రపంచం మొత్తం ప్రయాణిస్తూ ఉంటుందని జనం అనుకుంటున్నారు. అయితే, ఆ బొమ్మ వస్తు ప్రదర్శన శాలనుంచి దొంగలించబడిందా లేక మాయం అయిందా అన్నది తెలియరాలేదు.


అనబెల్ బొమ్మ చరిత్ర ఇది..

1970లో డోనా అనే నర్సుకు ఈ బొమ్మ బహుమతిగా వచ్చింది. డోనా, యాంజీ అనే మరో నర్సుతో కలిసి ఓ గదిలో కలిసి ఉండేది. ఈ బొమ్మ గదిలోకి వచ్చిన తర్వాతి నుంచి అంతా భయంకరంగా మారిపోయింది. వింత వింత సంఘటనలు జరగటం మొదలైంది. బొమ్మ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలేది. ‘ రక్షించండి.. మమ్మల్ని రక్షించండి’ అని రాసి ఉన్న కాగితం వారికి తరచుగా కనిపించేది. దీంతో డోనా, యాంజీ‌లు దెయ్యాలపై పరిశోధనలు చేసే ఎడ్, లారెన్ వారెన్‌లను కలిశారు. వారు దానిపై పరిశోధన చేసి.. ఆ బొమ్మ ఆత్మ కారణంగా ప్రభావితం అయిందని తేల్చారు. దాన్ని తీసుకెళ్లిపోయారు. వారి వస్తు ప్రదర్శన శాలలో పెట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి

Allu Aravind: తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు.. పవన్ కల్యాణ్ పేషీ నోట్‌పై అల్లు అరవింద్.

Female HR: రెజ్యూమ్ పంపమంటే.. ప్రేమ పైత్యం చూపించిన పోకిరీలు

Updated Date - May 25 , 2025 | 07:05 PM