Share News

Brothers Carry 200kg Cow: మానవత్వం అంటే ఇది.. 200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లి..

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:31 PM

Brothers Carry 200kg Cow: ఆవును ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 3 కిలోమీటర్లు కొండల్లోనే దాన్ని మోసుకుని తీసుకెళ్లాలి. అది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అదుపు తప్పి కిందపడితే.. ఆవుతో పాటు ఇద్దరి ప్రాణాలు పోతాయి. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రాణాలకు తెగించారు.

Brothers Carry 200kg Cow: మానవత్వం అంటే ఇది.. 200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లి..
Brothers Carry 200kg Cow

ఓ మనిషికి మరో మనిషి సాయం చేయటమే కష్టంగా మారిపోయిన రోజులివి. ఓ ఇద్దరు అన్నదమ్ములు ఆవు కోసం ఎవ్వరూ చేయని పని చేశారు. ఒకరకంగా చెప్పాలంటే తమ ప్రాణాలకు తెగించారు. 200 కేజీల బరువున్న ఆవును భుజాలపై మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి దగ్గరుందేమో అనుకునేరు. వారు ఉంటున్న ప్రాంతానికి ఆ ఆస్పత్రి కిలోమీటర్ల దూరంలో ఉంది. అనారోగ్యంతో ఉన్న ఆవును ఎంతో కష్టం మీద ఆస్పత్రిలో చేర్చారు. దాని ప్రాణాలు రక్షించారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. క్యారీ గంధా పంచాయతీకి చెందిన దయారామ్, లాల్ సింగ్‌లు అన్నదమ్ములు. వీరికి ఓ ఆవు ఉంది. గత కొన్ని రోజల నుంచి ఆవు అనారోగ్యంతో బాధపడుతోంది. రోజులు గడుస్తున్నా ఆవు కోలుకోలేదు. ఇక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే, అది నడవలేని పరిస్థితిలో ఉంది. వాళ్ల ఊరు కొండల్లో ఉంది. అక్కడ వాహనాలు తిరగవు. ఆవును ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే 3 కిలోమీటర్లు కొండల్లోనే దాన్ని మోసుకుని తీసుకెళ్లాలి.


అది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అదుపు తప్పి కిందపడితే.. ఆవుతో పాటు ఇద్దరి ప్రాణాలు పోతాయి. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రాణాలకు తెగించారు. దాన్ని వీపుకు కట్టుకుని కొండల్లో నడుచుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఆ ఇద్దరు అన్నదమ్ములకు హ్యాట్సాఫ్’..‘ఈ ఇద్దర్నీ ఆ దేవుడు చల్లగా చూస్తాడు. రియల్ హీరోస్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

పెంపుడు జంతువులతో ప్రయాణం.. ఈ విషయాలు తెలుసుకోండి..

Updated Date - Aug 03 , 2025 | 05:05 PM