Share News

Groom Qualification: వైరల్‌గా పెళ్లి పత్రిక.. పెళ్లి కొడుకు క్వాలిఫికేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Apr 28 , 2025 | 09:56 PM

Groom Qualification: బీహార్ రాష్ట్రానికి చెందిన మహావీర్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఆయుష్మతి కుమారి అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి పత్రికలు పంచుతూ ఉన్నారు.

Groom Qualification: వైరల్‌గా పెళ్లి పత్రిక.. పెళ్లి కొడుకు క్వాలిఫికేషన్ తెలిస్తే షాక్ అవుతారు..
Groom Qualification

ఈ ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఘనంగా పెళ్లి జరిగిందంటే.. పెళ్లి పత్రిక కచ్చితంగా ఉండాల్సిందే. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత దేశంలో జరిగే పెళ్లళ్ల తాలూకా పెళ్లి పత్రికలు చాలా భిన్నంగా ఉంటాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తాలూకా క్వాలిఫికేషన్ అందులో ఉంటుంది. పెళ్లి కొడుకు పేరు పక్కన చదివిన చదువును అందంగా చెక్కిస్తూ ఉంటారు. తాజాగా, ఓ యువకుడు తన పెళ్లి పత్రికలో వేసుకున్న క్వాలిఫికేషన్‌ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అతడి క్వాలిఫికేషన్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు కూడా.


బీహార్ రాష్ట్రానికి చెందిన మహావీర్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఆయుష్మతి కుమారి అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి పత్రికలు పంచుతూ ఉన్నారు. ఆ పెళ్లి పత్రికను ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. పత్రికలో వరుడు మహావీర్ క్వాలిఫికేషన్ చూసి జనాలు పగలబడి నవ్వుతున్నారు. పత్రికలో.. చిరంజీవి మహావీర్ కుమార్ పక్కన ‘ బీహారీ పోలీస్.. ఫిజికల్ క్వాలిఫైడ్ అని ఉంది. ఆ క్వాలిఫికేషన్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.


ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పెళ్లి పత్రికపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ నాకు ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ అవ్వాలని ఉంది. నా కలలో ఉత్తర ప్రదేశ్ సబ్ ఇన్‌స్పెక్టర్ అయ్యాను అని పత్రికలో వేయించుకోవచ్చా’.. ‘ నేను గ్రూపు డీ ఫామ్ ఫిలప్ చేశాను. నేను దాన్ని వేయించుకోవచ్చా’.. ‘ పెళ్లి పత్రికలో ఆ క్వాలిఫికేషన్ ఏంటి బ్రో’..‘ నాకు తెలిసి.. ఆ పెళ్లి కొడుకును ఫూల్‌ను చేయడానికి ఎవరో కావాలని అలా రాయించారు’.. ‘ ఇలాంటి క్వాలిఫికేషన్‌ను నేను ఎక్కడా చూడలేదు బాబోయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

KCR: జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా కేటీఆర్‌కు గాయం..

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Updated Date - Apr 28 , 2025 | 09:59 PM