Government School Children: మరీ ఇంత దారుణమా.. చిత్తు కాగితాల్లో పిల్లలకు భోజనం..
ABN , Publish Date - Nov 07 , 2025 | 03:27 PM
చిన్నారులకు భోజనాన్ని ప్లేట్లలో కాకుండా చిత్తు కాగితాల్లో వడ్డించారు. అది కూడా మురికిగా ఉండే నేలపై పేపర్ పెట్టి వాటిపై భోజనం వడ్డించారు. పాపం ఆ పిల్లలు చిత్తు కాగితాల్లోనే భోజనం చేశారు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
భారత దేశంలో చిన్న పిల్లలను దేవుళ్లకు ప్రతి రూపాలుగా భావిస్తారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు కడుపునిండా భోజనం పెడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఈ పథకం సరైన విధంగా అమలు కావటం లేదు. రుచి కరమైన భోజనం పిల్లలు అందటం లేదు. పలు రకాల ఇబ్బందులు ఉన్నాయి.
తాజాగా, మధ్య ప్రదేశ్‌లో మనసు కలిచి వేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్లేట్లలో కాకుండా చిత్తు కాగితాల్లో వడ్డించారు. మురికి రోడ్డుపై చిత్తు కాగితాల్లోనే పిల్లలు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షియోర్‌పూర్ జిల్లాలోని హల్‌పూర్ గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే. రెండు రోజుల క్రితం పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించటంలో దారుణం చోటుచేసుకుంది.
చిన్నారులకు భోజనాన్ని ప్లేట్లలో కాకుండా చిత్తు కాగితాల్లో వడ్డించారు. అది కూడా మురికిగా ఉండే నేలపై పేపర్ పెట్టి వాటిపై భోజనం వడ్డించారు. పాపం ఆ పిల్లలు చిత్తు కాగితాల్లోనే భోజనం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో జిల్లా అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. కలెక్టర్ అర్పిత్ వర్మ సంఘటనపై తక్షణ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ సంఘటన నిజమేనని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ నిర్థారించారు. దీంతో ఇందుకు కారణమైన ఇద్దరిని కలెక్టర్ విధుల్లోంచి తొలగించారు.
ఇవి కూడా చదవండి
పెను విషాదం.. వీధి కుక్కలనుంచి తప్పించుకోబోయి..