Viral Video: ఫ్రిజ్ తెరిచిచూసి షాక్.. లోపల బుసలు కొడుతూ నాగరాజు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:46 PM
Cobra In Fridge Viral Video: బ్రబు కింగ్ 353 అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో విడుదల అయింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మనుషులకే కాదు.. మూగ జీవాలకు కూడా ఎండ దెబ్బ కొడుతుంది. అందుకే అవి అలా చల్ల ప్రదేశాల్లో దాక్కుంటూ ఉంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం బయట తిరగాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. నిమిషంలో తల పగిలిపోయేంతలా భానుడు భగ్గుమంటున్నాడు. ఈ నేపథ్యంలో మనుషులు బయట తిరగటం తగ్గించేశారు. అత్యంత అవసరం అయితేనే.. ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. ఇక, మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎండ దెబ్బకు నీడ పట్టునే ఉండిపోతున్నాయి. కొన్ని సార్లు సరిసృపాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఎక్కడ చల్లగా అంటే అక్కడ దాక్కుంటాయి.
కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి చల్లనీళ్ల తాగుదామని ఫ్రిజ్ ఓపెన్ చేశాడు. ఫ్రిజ్ లోపల బుసలు కొడుతూ నాగు పాము దర్శనం ఇచ్చింది. అంతే అతడు షాక్ అయిపోయాడు. ఆ నాగు పాము ఫ్రిజ్ డోరు అరలో పడగ విప్పి కూర్చుంది. ఫ్రిజ్ ఓపెన్ చేసిన వ్యక్తి వైపు కోపంగా చూస్తూ ఉంది. బ్రబు కింగ్ 353 అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో విడుదల అయింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మనుషులకే కాదు.. మూగ జీవాలకు కూడా ఎండ దెబ్బ కొడుతుంది. అందుకే అవి అలా చల్ల ప్రదేశాల్లో దాక్కుంటూ ఉంటాయి’..
పాములకు మనుషుల లాగా స్వేద గ్రంధులు ఉండవు. అవి ఉక్కపోతను తట్టుకోలేవు. అందుకే చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి’.. ‘ ఆ డోరు తెరిచిన వ్యక్తి అదృష్టం బాగుంది. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి’.. ‘ పాములు ఎక్కడ బడితే అక్కడ చొరబడుతున్నాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
Summer Health Tips: వేసవిలో అలసటగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా.. వీటిని ఆహారంగా తీసుకోండి..