Thieves Steal Sewer Cover: మీ కక్కుర్తి పాడు గాను.. వాటిని కూడా వదలరా..
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:43 PM
Thieves Steal Sewer Cover: ఆ దొంగలు పక్కా ప్లాన్‌తో దొంగతనం చేశామని అనుకున్నారు. ఆటో నెంబర్ ప్లేట్ కనపడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. దానికి పెయింట్ వేశారు. అయితే, సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో దొంగలు మరీ దారుణంగా తయారు అయ్యారు. కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దేన్నీ వదిలి పెట్టడం లేదు. దొంగలు ఎంత కక్కుర్తిగా తయారయ్యారంటే.. మురికి కాల్వల మీద కప్పిన మూతల్ని కూడా వదలటం లేదు. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు రోడ్డు పక్క ఉన్న మురికి కాల్వపై మూసిన ఇనుప డ్రైనేజీ కవర్‌ను దొంగలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
53 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్క మురికి కాల్వపై మూసి ఉన్న ఇనుప డ్రైనేజీ కవర్ల దగ్గరకు వచ్చారు. స్తంభానికి ఆనుకుని ఉన్న కవర్‌ను బయటకు తీయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఓ ఆటో అక్కడికి వచ్చింది. ఆ ఆటోలోని వ్యక్తి కూడా ఈ దొంగల ముఠాలో సభ్యుడే. జనం అటువైపు వస్తున్నారా లేదా చూసుకుని ఇద్దరు దొంగలు కవర్‌ను పైకి లేపారు. ఆ వెంటనే ఆటోలోకి చేర్చారు. ఇక, ఆలస్యం చేయకుండా ఆటో ముందుకు కదిలింది. ఇద్దరూ దాన్ని ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆ దొంగలు పక్కా ప్లాన్‌తో దొంగతనం చేశామని అనుకున్నారు. ఆటో నెంబర్ ప్లేట్ కనపడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. దానికి పెయింట్ వేశారు. అయితే, సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఎంతకు తెగించార్రా.. మ్యాన్ హోల్ మూతల్ని కూడా వదలరా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
డేటింగ్‌కు వెళ్లినందుకు చుక్కలు చూపించింది.. పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఏం చేసిందంటే..
చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు