Dubai Humanoid Robo: వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:30 PM
దుబాయ్‌లో ఓ రోబో అచ్చు మనిషిలా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం నెట్టింట కలకలం రేపుతోంది. ఇక మనుషుల భవిష్యత్తు ఇదే అంటూ జనాలు ఈ వీడియోను చూసి ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తు అంతా ఏఐ రోబోలదే అన్న అంచనాలు ఉన్నాయి. ఇది నిజమనేందుకు రుజువుగా ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. దుబాయ్‌లో నడి రోడ్డుపై ఓ రోబో చేసిన హల్‌చల్‌ను వీడియోలో చూసిన జనాలు షాకైపోతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు కూడా ఇదే రేంజ్‌లో నోరెళ్లబెడుతున్నారు.
నాజిష్ ఖాన్ అనే వ్యక్తి తొలుత ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. వెలకమ్ టూ ద ఫ్యూచర్ అన్న క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. మీడియా కథనాల ప్రకారం, ఎమిరేట్స్ టవర్స్ దగ్గర ఈ ఉదంతం చోటుచేసుకుంది. మనిషి ఆకారంలో ఉన్న ఓ రోబో అచ్చం సాధారణ మనుషుల్లాగే రోడ్డు దాటిన వైనం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. నలుదిక్కులా చూస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తూ రోబో ముందుకెళ్లింది. అక్కడక్కడా ఆగి చుట్టుపక్కల చూసుకుంది. రోబో ఆపరేటర్ కూడా దాని వెంటే ఉన్నాడు. అతడి నియంత్రణకు అనుగుణంగా రోబో రోడ్డును సులువుగా దాటేసింది. ఆ తరువాత ఫుట్‌పాత్‌పై కూడా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అచ్చు మనిషిలాగే ప్రవర్తిస్తూ రోడ్డుపై వెళుతున్న రోబోను చూసి జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది.
ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సాంకేతికత మరీ ఇంతలా అభివృద్ధి చెందిదా అంటూ నోరెళ్లబెడుతున్నారు బిజీ నగర జీవితానికి అడ్జస్ట్ కాగలిగే రోబోలు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయంటే సాంకేతికాభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇలా మనిషిలా కనిపించే వాటిని హ్యూమనాయిడ్ రోబోలని పిలుస్తారు. రెండు కాళ్లపై నడిచే వీటిని మనుషులకు అన్ని పనుల్లో సాయపడేలా డిజైన్ చేస్తారు. ఈ సీన్ రాబోయే భవిష్యత్తుకు సంకేతమని అనేక మంది అన్నారు. ఏఐ రాకతో మానవ ప్రపంచంలో సమూల మార్పులు తప్పవని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్