Share News

Stray Dogs: ఒక్కసారిగా అమ్మాయిపై దాడి చేసిన వీధి కుక్కలు..

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:49 PM

Stray Dogs: ఓ కుక్క యువతిపై దాడికి దిగింది. కొద్దిసేపటికే మరో మూడు కుక్కలు యువతి దగ్గరకు వచ్చాయి. ఆమెపై దాడి చేయటం మొదలెట్టాయి. యువతి వాటినుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించసాగింది.

Stray Dogs: ఒక్కసారిగా అమ్మాయిపై దాడి చేసిన వీధి కుక్కలు..
Stray Dogs

గత కొంతకాలంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ నాలుగు కుక్కలు రోడ్డుపై వెళుతున్న యువతిపై దాడి చేశాయి. విచక్షణా రహితంగా కరిచాయి. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన ఓ యువతి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది.


ఎక్కడినుంచి వచ్చిందో కానీ, ఓ కుక్క యువతిపై దాడికి దిగింది. కొద్దిసేపటికే మరో మూడు కుక్కలు యువతి దగ్గరకు వచ్చాయి. ఆమెపై దాడి చేయటం మొదలెట్టాయి. యువతి వాటినుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించసాగింది. కాళ్లతో కొట్టసాగింది. దీంతో అవి ఆమెను వదిలిపెట్టి అక్కడినుంచి వెళ్లిపోయాయి. యువతి బతుకు జీవుడా అనుకుంది. కొద్దిసేపటి తర్వాత పైకి లేచి అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆ కుక్కలు మళ్లీ ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాయి.


అటుగా వెళుతున్న ఓ యువతి ఇది గమనించింది. సాయం చేయడానికి ముందుకు వచ్చింది. రాళ్లతో కుక్కల్ని కొట్టి భయపెట్టింది. వాటిని అక్కడినుంచి తరిమేసింది. ఇక, కుక్కల దాడిలో యువతి కాళ్లకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కుక్కల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని నియంత్రించలేకపోతోందంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

మతం మారాలంటూ భార్య వేధింపులు.. భర్త ఏం చేశాడంటే..

షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మంది మృతి..

Updated Date - Jul 17 , 2025 | 01:53 PM