Shocking Animal: ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:09 PM
నిర్మానుష్య ప్రదేశంలో బైక్ లేదా కారు మీద వెళ్తున్నప్పుడు సింహం ఎదురొస్తే మీకు ఎలా అనిపిస్తుంది. తాజాగా ఐర్లాండ్ ప్రజలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు.
క్రూరమృగాలను దగ్గరగా చూస్తే ఎవరికైనా గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోతుంది. సింహం లేదా పులి తిరుగుతోందంటే అందరూ భయం భయంగానే గడుపుతారు. అలాంటిది నిర్మానుష్య ప్రదేశంలో బైక్ లేదా కారు మీద వెళ్తున్నప్పుడు సింహం ఎదురొస్తే మీకు ఎలా అనిపిస్తుంది. తాజాగా ఐర్లాండ్ ప్రజలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు (forest animal panic).
ఐర్లాండ్‌లోని కౌంటీ క్లేర్‌లోని మౌంట్‌షానన్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో అచ్చం సింహంలాంటి ఒక జంతువు ఓ ట్రక్ డ్రైవర్‌కు రోడ్డుపై కనిపించింది. వెంటనే ఆ ట్రక్ డ్రైవర్ ఆగిపోయి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చెట్ల మధ్యకు ఆ సింహం వెళుతున్నట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. 'ఐర్లాండ్‌లో సింహం స్వేచ్ఛగా తిరుగుతోందా' అంటూ అందరూ ఆశ్చర్యపోయారు (mysterious animal). ఈ వీడియో వైరల్ కాగానే స్థానికులు హడలిపోయారు.

ఇది జూ నుంచి తప్పించుకున్న సింహం అంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ఆ వీడియో ఆధారంగా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే ఐరిష్ పోలీసులు, అటవీ అధికారులు రంగంలోకి దిగారు (police investigation mouse). చివరకు ఆ ట్రక్ డ్రైవర్‌కు కనిపించిన జంతువును పట్టుకున్నారు. నిజానికి అది సింహం కాదు. 'మౌస్' అని పిలిచే న్యూ ఫౌండ్‌ల్యాండ్ కుక్క అని తేల్చారు. అది చూడడానికి దాదాపు సింహంలాగానే ఉంటుంది. ఆ జంతువు సింహం కాదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..
బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి