Share News

TikTok Live: టిక్‌టాక్ లైవ్‌లో మర్డర్.. కెమెరాలో రికార్డైన భయానక దృశ్యాలు

ABN , Publish Date - May 15 , 2025 | 01:27 PM

TikTok Live: వలెరియా తన ఫాలోవర్ల కోసం మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఆమె టిక్‌టాక్‌లో లైవ్‌కు వచ్చింది. ఎంతో సంతోషంగా ఫాలోవర్లతో మాట్లాడుతూ ఉంది.

TikTok Live: టిక్‌టాక్ లైవ్‌లో మర్డర్.. కెమెరాలో రికార్డైన భయానక దృశ్యాలు
TikTok Live

ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయి చాలా ఏళ్లు అవుతోంది. టిక్‌టాక్ ఇండియాలో అందుబాటులో ఉన్నంత వరకు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు వేరే దేశాల్లో టిక్‌టాక్ అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది. తాజాగా, టిక్‌టాక్‌ లైవ్ చేస్తుండగా ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను తుపాకితో కాల్చి చంపేశాడు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ఆమె ఫోన్‌లో రికార్డు అయ్యాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన 23 ఏళ్ల వలెరియా మార్క్‌వెజ్‌కు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.


ఒక్కో సోషల్ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వలెరియా తన ఫాలోవర్ల కోసం మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి కూడా వస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఆమె టిక్‌టాక్‌లో లైవ్‌కు వచ్చింది. ఆమెకు సంబంధించిన బ్యూటీ సెలూన్‌లో కూర్చుని ఫాలోవర్లతో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో ఊహించని దారుణం జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి తుపాకితో ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు సార్లు ఆమెను కాల్చిపడేశాడు. లైవ్‌లో ఉండగానే ఆమె చనిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం ఫోన్‌లో రికార్డు అయ్యాయి.


ఇక, సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వలెరియా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వలెరియా రొమ్ము, తల మీద బుల్లెట్ గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. బైకు మీద వచ్చిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, సోషల్ మీడియా వ్యాప్తంగా వలెరియా హత్య చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పాక్ కుక్కలా భయపడింది.. అందుకే రాజీకి వచ్చింది

Michael Rubin: భారతీయులు ట్రంప్‌ మాటల్ని సీరియస్‌గా తీసుకోకండి.. అమెరికా మాజీ అధికారి..

Updated Date - May 15 , 2025 | 01:46 PM