Share News

Honking Dispute: హారన్ విషయంలో గొడవ.. ఇంట్లోకి చొరబడి మరీ దారుణం..

ABN , Publish Date - Jul 15 , 2025 | 09:51 AM

Honking Dispute: నలుగురు వ్యక్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన దృశ్యాలు హాలులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నీల్ తనపై దాడి చేసిన నలుగురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరా దృశ్యాల తాలూకా వీడియోను పోలీసులకు అందించాడు.

Honking Dispute: హారన్ విషయంలో గొడవ.. ఇంట్లోకి చొరబడి మరీ దారుణం..
Honking Dispute

హారన్ విషయంలో గొడవ దారుణానికి తెరతీసింది. ఓ నలుగురు వ్యక్తులు.. యువకుడి ఇంట్లోకి చొరబడి మరీ దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌లోని బల్లభ్‌ఘర్ సెక్టార్ 9కు చెందిన నీల్ నయన్ తన ఇంటి ముందు ఓ టెంపో ఆపాడు. అందులోని సరుకుల్ని ఇంట్లోకి తీసుకెళుతూ ఉన్నాడు. అన్ష్ భార్గవ్ అనే వ్యక్తి అటువైపు వచ్చాడు. టెంపో అడ్డంగా ఉండటంతో హారన్ కొట్టాడు.


సరుకులు దించుతున్నానని, కొంచెం సమయం పడుతుందని నీల్ చెప్పాడు. అన్ష్ సహనం లేని వాడిలా అదే పనిగా హారన్ కొడుతూనే ఉన్నాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ బాగా తిట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత గొడవ ఆగిపోయింది. అన్ష్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. నీల్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అన్ష్ ఓ ముగ్గురు వ్యక్తులతో నీల్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ నలుగురు నీల్‌పై దాడి చేయటం మొదలెట్టారు. తర్వాత నీల్ రూములోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.


నలుగురు వ్యక్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన దృశ్యాలు హాలులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నీల్ తనపై దాడి చేసిన నలుగురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరా దృశ్యాల తాలూకా వీడియోను పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, దాడి తాలూకా దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

100 ఏళ్ల వయసులో రికార్డులు.. 114 ఏళ్ల వయసులో అనుకోని విషాదం..

Updated Date - Jul 15 , 2025 | 10:34 AM