Share News

Baby Shower For Dog: కుక్కకు అత్యంత ఘనంగా సీమంతం వేడుక

ABN , Publish Date - Nov 18 , 2025 | 07:01 AM

కేరళకు చెందిన ఓ ఫ్యామిలీ తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించింది. సాంప్రదాయ పద్దతిలో వేడుక చేసింది. ప్రస్తుతం కుక్క సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Baby Shower For Dog: కుక్కకు అత్యంత ఘనంగా సీమంతం వేడుక
Baby Shower For Dog

హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లు గర్భందాల్చిన తర్వాత సీమంతం చేస్తూ ఉంటారు. తాహతను బట్టి వేడుక నిర్వహిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తమ పెంపుడు జంతువులు గర్భం దాల్చినా సీమంతం చేస్తున్నారు. గతంలో ఓ వ్యక్తి ఆవుకు ఘనంగా సీమంతం వేడుక చేశాడు. తాజాగా ఓ కుటుంబం పెంపుడు కుక్కకు సీమంతం చేసింది. అత్యంత ఘనంగా ఈ వేడుక నిర్వహించింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళకు చెందిన జితిన్ అనే వ్యక్తి కుటుంబం మినియేచర్ పిన్స్చర్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటోంది. ఆ ఫ్యామిలీ కుక్కను తమ కుటుంబంలో ఒక మనిషిలా భావించేది. ఎంతో ప్రేమగా చూసుకునేది. కొద్దిరోజుల క్రితం ఆ కుక్క గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే జతిన్ కుటుంబం ఎంతో సంతోషించింది. డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని జతిన్ తరచుగా కుక్కను టెస్టులకు తీసుకెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే జతిన్ ఫ్యామిలీ ఆ కుక్కకు అత్యంత ఘనంగా సీమంతం వేడుక నిర్వహించింది.


అచ్చం మనుషులకు చేసినట్లే కుక్కను అందంగా అలంకరించి సాంప్రదాయ పద్దతిలో సీమంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు, వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఇలా చేస్తున్నారు’..‘కుక్కను ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్’..‘చాలా మంది నిరుపేదల కంటే పెంపుడు కుక్కలే ఎంతో లగ్జరీగా జీవిస్తున్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు: భజ్జీ

ఆ ఏరియాల్లో 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ కట్..

Updated Date - Nov 18 , 2025 | 07:01 AM