Ramayana Record: 38 ఏళ్లయినా క్రేజ్ ఏ మాత్రం తక్కలేదు..
ABN , Publish Date - May 04 , 2025 | 06:29 PM
Ramayana Record: జనం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోఖ్లే.. సీతగా నటించిన దీపికా చిక్లియాలను సీతారాములుగానే చూశారు. వేరే పాత్రల్లో వారిని ఊహించుకోలేకపోయారు. అందుకే వారికి సక్సెస్ రాలేదు. ఫేడ్ అవుట్ అయిపోయారు.

1980లలో రామాణం సీరియల్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. దూరదర్శన్‌లో ఏడాదికిపైగా ప్రసారం అయిన ఈ సీరియల్ టీఆర్‌పీలో టాప్‌లో నిలిచింది. ఐదు ఖండాల్లోని 17 దేశాల్లో 20 వేర్వేరు ఛానళ్లలో కూడా ఈ సీరియల్ ప్రసారం అయింది. 1987లో 9 లక్షల రూపాయలు పెట్టి ఈ సిరియల్ తీశారు. అంత బడ్జెట్ పెట్టి తీసిన సీరియల్ ఆ టైంలో ఇదే కావటం విశేషం. ప్రసారం అయిన ప్రతీ ఎపిసోడ్ 40 లక్షల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. ఇంత చరిత్ర ఉన్న ఈ సీరియల్‌ను కరోనా టైంలో పున:ప్రసారం చేశారు.
అప్పుడు కూడా ఊహించని విధంగా షోకు రెస్పాన్స్ వచ్చింది. బీబీసీ రిపోర్టు ప్రకారం.. 2020 ఏప్రిల్ 16వ తేదీన ఏకంగా 77 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టీవీ షోగా రికార్డు సృష్టించింది. టీఆర్‌పీ రేటింగ్ ఏకంగా 77 వచ్చింది. ఇంత రేటింగ్ వచ్చిన సీరియల్ ఇప్పటి వరకు ఏదీ లేదు. అయితే, రామయణం సీరియల్‌లో నటించిన వారు కెరీర్‌లో సక్సెస్ కాలేకపోయారు. రామయణం తర్వాత వారు చేసిన ప్రాజెక్టులకు పెద్దగా ఆదరణ రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. జనం సీరియల్‌లో రాముడిగా నటించిన అరుణ్ గోఖ్లే.. సీతగా నటించిన దీపికా చిక్లియాలను సీతారాములుగానే చూశారు.
వేరే పాత్రల్లో వారిని ఊహించుకోలేకపోయారు. అందుకే వారికి సక్సెస్ రాలేదు. ఫేడ్ అవుట్ అయిపోయారు. అయినా కూడా.. పాత తరం వారు వీరిని సీతారాములుగానే చూస్తున్నారు. ఎక్కడైనా కనిపిస్తే కాళ్లకు మొక్కుతున్నారు. భక్తితో ప్రార్థనలు కూడా చేస్తున్నారు. 1987లో సీరియల్ ప్రసారం అయ్యే సమాయానికి వీధులు మొత్తం నిర్మానుషంగా మారేవట. దుకాణాలుకూడా మూసే వారట. జనం స్నానం చేసి మరీ టీవీల దగ్గర కూర్చునేవారట. టీవీలకు దండలు వేసి పూజలు కూడా చేసే వారట. అప్పుడు అంతలా సీరియల్‌ను ఆదరించారు. ఇప్పటికీ ఆ ఆదరణ కొనసాగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్
Trump Import Duties: పచ్చళ్లపైనా ట్రంప్ సుంకం