Share News

Viral Video: అరుదైన దృశ్యం.. పొలంలో రాబందుల గుంపు

ABN , Publish Date - Jun 22 , 2025 | 08:11 PM

Viral Video: మట్టి రహదారి పక్కన ఉన్న గోడపై కొన్ని.. పొలంలో కొన్ని రాబందులు కనిపించాయి. రెక్కలు చాచి వర్షంలో తడుస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.

Viral Video: అరుదైన దృశ్యం.. పొలంలో రాబందుల గుంపు
Viral Video

ఎవరైనా మనల్ని అదే పనిగా కష్టపెడుతూ ఉంటే.. రాబందుల్లా పీక్కుతింటున్నారు అంటాం. అలాంటి రాబందుల్నే మనుషులు పీక్కు తీనేశారు. అంటే నా ఉద్దేశ్యం చంపి తిన్నారని కాదు.. మనిషి కారణంగా రాబందులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అంతరించిపోతున్న జీవుల జాతిలో చేరాయి. ఒకప్పుడు ఊరి బయట పెద్ద సంఖ్యలో కనిపించేవి. ఇప్పుడు జిల్లా అంతా వెతికినా ఒకటి, రెండు కనిపించటం అరుదైన విషయం అయిపోయింది.


1940 సమయంలో దేశ వ్యాప్తంగా దాదాపు 5 కోట్ల వరకు రాబందులు ఉండేవి. 1970 నాటికి అది కోటికి తగ్గిపోయింది. దాదాపు నలభై ఏళ్లలో రాబందులు సంఖ్య అత్యంత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వాటి సంఖ్య 15వేల దగ్గర ఉంది. 2019తో పోల్చుకుంటే ఇది మంచి సంఖ్య. అప్పట్లో 8,397 మాత్రమే ఉండేవి. 2025 నాటికి వాటి సంఖ్య పెరిగింది. తాజాగా, రాజస్థాన్, బరన్ జిల్లాలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గణేష్‌పూర్ నాకలోని పొలాల్లో పెద్ద సంఖ్యలో రాబందులు దర్శనం ఇచ్చాయి.


మట్టి రహదారి పక్కన ఉన్న గోడపై కొన్ని.. పొలంలో కొన్ని రాబందులు కనిపించాయి. రెక్కలు చాచి వర్షంలో తడుస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అంతరించిపోయాయి అనుకున్నా.. ఇంకా బతికే ఉన్నాయా.. వాటిని చూస్తుంటే సంతోషంగా ఉంది’..‘రాబందులను ఎప్పుడో నా చిన్నపుడు చూశాను. మళ్లీ ఇప్పుడిలా వీడియోలో చూస్తున్నా’ అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కూతుర్ని దారుణంగా కొట్టిన డాక్టర్

హీరోయిన్ ఇంట్లో దెయ్యం.. ఏం చేయొద్దని బతిమాలిందట..

Updated Date - Jun 22 , 2025 | 08:21 PM