Share News

Elephant Viral Video: నదిలో పడిపోయిన కారు.. బయటకు లాక్కొచ్చిన ఏనుగు..

ABN , Publish Date - May 29 , 2025 | 02:49 PM

Elephant Viral Video: కారు బరువు 2వేల కేజీలకు పైనే ఉంటుంది. నది ఒడ్డున మొత్తం ఇసుక ఉండటంతో దాన్ని బయటకు తీసుకురావటం మనుషుల వల్ల కాలేదు. దీంతో ఓ గజ రాజాన్ని రంగంలోకి దింపారు. కారు ఉన్న దగ్గరకు తీసుకెళ్లారు.

 Elephant Viral Video: నదిలో పడిపోయిన కారు.. బయటకు లాక్కొచ్చిన ఏనుగు..
Elephant Viral Video

అడవికి రాజు సింహమే కావచ్చు. బలం విషయంలో.. అడవిలో సాటి లేని జంతువు అంటే.. కచ్చితంగా ఏనుగే. భారీ ఖాయంతో ఉండే ఏనుగుల శక్తి అమోఘం. సింహాలను కూడా దెబ్బకు చంపేయగలవు. పెద్ద పెద్ద చెట్లను కూడా తొండంతో పీకి పాడేయగలవు. అలాంటి శక్తి వంతమైన ఏనుగుల్ని కొంతమంది పనులు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అవి బరువైన వస్తువుల్ని మోయటంలో జనాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఆపద సమయాల్లో కూడా ఏనుగులు అవసరమవుతూ ఉంటాయి. ఇందుకు కేరళలో జరిగిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.


ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో టయోటా పార్ట్యునర్ కారు నదిలో పడిపోయింది. దాని బరువు 2వేల కేజీలకు పైనే ఉంటుంది. నది ఒడ్డున మొత్తం ఇసుక ఉండటంతో దాన్ని బయటకు తీసుకురావటం మనుషుల వల్ల కాలేదు. దీంతో ఓ గజ రాజాన్ని రంగంలోకి దింపారు. కారు ఉన్న దగ్గరకు తీసుకెళ్లారు. కారుకు తాడు కట్టి.. దాన్ని ఏనుగుకు ఇచ్చారు. ఆ తాడును తొండంతో పట్టుకోవటం దానికి ఇబ్బందిగా మారింది. అందుకే పళ్లతో అదిమిపట్టింది. కొంచెం తొండం సాయం తీసుకుని కారును బయటకు లాగసాగింది.


పట్టు సరిగా దొరకలేదు కాబట్టి.. కొంచెం కష్టంగా దాన్ని పక్కకు లాగింది. మొత్తానికి ఆ కారు బయటకు వచ్చేసింది. సాద్‌కోయ అనే వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ ఈ ఇలాంటి జుజూబీ పనులకు నన్ను ఎందుకు పిలుస్తారు.. అని ఏనుగు అనుకుంటూ ఉంటుంది’.. ‘ ఎంత టెక్నాలజీ వచ్చిన .. ఏనుగు బలానికి ఏదీ సాటి రాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రైలుకు వేలాడుతూ యువతి భయంకర విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..

బీఆర్‌ఎస్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - May 29 , 2025 | 03:02 PM