Share News

Kangana Ranaut: కరెంట్ బిల్ వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:04 AM

Kangana Ranaut Manali House: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మూడు నెలల నుంచి ఆమె కరెంట్ బిల్లులు కట్టడం లేదంటూ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ నోటీసులు పంపంది.

Kangana Ranaut: కరెంట్ బిల్ వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్
Kangana Ranaut Manali House

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడి వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఈ సారి ఆమె కరెంట్ బిల్ వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కంగనా రనౌత్‌ది హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి అని తెలిసిన విషయమే. బాలీవుడ్‌లో అడుగు పెట్టేముందు వరకు ఆమె అక్కడే ఉన్నారు. బాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత మనాలిలో ఓ ఇళ్లు కట్టించుకున్నారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ ఉండటం లేదు. బుధవారం మనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నేను మనాలిలోని ఇంట్లో ఉండటం లేదు.


కానీ, కరెంట్ మీటర్ మాత్రం గిర్రున తిరుగుతోంది. నాకు కరెంట్ బిల్ కట్టాలంటూ నోటీసు వచ్చింది. ఈ నెల నాకు ఏకంగా లక్ష రూపాయల బిల్లు వచ్చింది. ’ అని పేర్కొంది. కంగనా చేసిన కామెంట్లపై హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ ఎండీ సందీప్ కుమార్ గురువారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ తనకు లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చిందని కంగనా రనౌత్ మేడమ్ అన్నారు. అది కూడా ఆమె ఇండని ఇంటికి అంత బిల్లు వచ్చిందని అన్నారు. నేను ఆమెకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అందులో నిజం లేదు. ఆమెకు కేవలం 55 వేల రూపాయల కరెంట్ బిల్ మాత్రమే వచ్చింది.


జనవరి, ఫిబ్రవరి నెల బిల్లులు 32 వేలు వచ్చాయి. వాటిని ఆమె కట్టలేదు. దీంతో పెనాల్టీ పడింది. అంతా కలిపి 91,000 వేల రూపాయలు కట్టాల్సి ఉంది. మార్చి నెలలో ఆమె 900 యూనిట్ల కరెంట్‌ను వాడుకుంది. ఆమెకు మార్చిన నెలలో 700 రూపాయల గవర్నమెంట్ సబ్సీడీ కూడా వచ్చింది ’ అని అన్నారు. కాగా, మనాలిలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై కంగనా ప్రశంసల జల్లులు కురిపించారు. ‘ఆయన దేవుడి అవతారం. 2014లో ఆయన గెలిచినపుడు రాజకీయాలపై యువత ఆలోచనా తీరు మారింది. నా ఆలోచనల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అసలు రాజకీయాలపై మంచి అభిప్రాయం ఉండేది కాదు. చెత్త రాజకీయాలు అనుకునే దాన్ని’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Nimmala Ramanaidu: జగన్‌ నుంచే ప్రజలకు భద్రత కావాలి

Updated Date - Apr 11 , 2025 | 11:42 AM