Korba Viral Video: తప్పతాగి.. నడిరోడ్డుపై పోలీసులతో గొడవ..
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:24 PM
Korba Viral Video: ఈ గొడవ గురించిన సమాచారం పోలీసులకు వెళ్లింది. వారు అక్కడికి వచ్చారు. రెండు గ్రూపుల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ రెండు గ్రూపుల్లోని ఎవ్వరూ కూడా పోలీసుల మాటల్ని లెక్కచేయలేదు. పోలీసులతోటే గొడవకు దిగారు.

తప్పతాగిన ఓ మహిళ పోలీసులతో గొడవ పెట్టుకుంది. అర్థరాత్రి నడిరోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి కోర్బాలోని ట్రాన్స్‌పోర్టు నగర్ ఏరియాలో ఉన్న ఓ నైట్ క్లబ్‌లో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటి తర్వాత ఆ రెండు గ్రూపులు నైట్ క్లబ్ బయటకు వచ్చి గొడవపడసాగాయి. రెండు గ్రూపుల్లోని వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోసాగారు. గొడవ సందర్భంగా ఓ వాహనం సైతం ధ్వంసం అయింది.
ఈ గొడవ గురించిన సమాచారం పోలీసులకు వెళ్లింది. వారు అక్కడికి వచ్చారు. రెండు గ్రూపుల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ రెండు గ్రూపుల్లోని ఎవ్వరూ కూడా పోలీసుల మాటల్ని లెక్కచేయలేదు. పోలీసులతోటే గొడవకు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో.. ఓ మహిళ స్కూటీపై కూర్చుని ఉంది. ఆమె వెనకాల ఆమె భర్త కూర్చున్నాడు. ఆ మహిళ పోలీస్‌తో గొడవ పడుతూ ఉంది.
‘నా భర్తను చంపేసి, మీరు పూడ్చేస్తారా?’ అంటూ తాగిన మైకంలో ఏదేదో వాగుతూ ఉంది. వెనకాల కూర్చున్న భర్త మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన పోలీస్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మహిళ మాత్రం వెనక్కుతగ్గలేదు. అరుస్తూనే ఉంది. మరో వీడియోలో ఆమె భర్త రోడ్డుపై నిలబడి ఎవరికో వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంఘటనకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇలాంటి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి గట్టిగా బుద్ది చెప్పాలి’..‘ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..
ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..