Share News

Viral Video: తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ

ABN , Publish Date - Aug 01 , 2025 | 07:09 PM

Viral Video: ఎస్ఐ శ్యామ్ ప్రతీ రోజూ తాగి డ్యూటీకి వెళుతున్నాడు. కొద్దిరోజుల క్రితం తాగి బైకుపై డ్యూటీకి బయలు దేరాడు. హెడ్ కానిస్టేబుల్ బైకు నడుపుతుంటే.. శ్యామ్ వెనకాల కూర్చున్నాడు.

Viral Video: తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
Viral Video

ప్రజల క్షేమం కోసం పాటు పడాల్సిన కొందరు పోలీసులు తప్పుదోవపడుతున్నారు. తప్పతాగి నలుగురిలో పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ పోలీసు అధికారి తప్పతాగి జనానికి దొరికిపోయాడు. అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లంభూవా కోత్వాలీ ఏరియాకు చెందిన శ్యామ్ కుమార్ సింగ్.. శివ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్యామ్ తాగుడుకు బానిస అయ్యాడు.


ప్రతీ రోజూ తాగి డ్యూటీకి వెళుతున్నాడు. కొద్దిరోజుల క్రితం తాగి బైకుపై డ్యూటీకి బయలు దేరాడు. హెడ్ కానిస్టేబుల్ బైకు నడుపుతుంటే.. శ్యామ్ వెనకాల కూర్చున్నాడు. ఓ చోట రైల్వే గేటు పడటంతో పోలీసులు వెళుతున్న బైకుతోపాటు పెద్ద మొత్తంలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి శ్యామ్ తాగి ఉండటాన్ని గుర్తించాడు. అందరి ముందు నిలదీశాడు. దీంతో శ్యామ్ ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దదవటంతో బైకు మీద నుంచి కిందకు దిగాడు.


మందు మైకంలో ఊగుతూ నడుస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. రైల్వే గేటు వేసి ఉన్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా గేటు దాటి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. పోలీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. వారు శ్యామ్‌పై చర్యలకు సిద్ధమయ్యారు.


ఇవి కూడా చదవండి

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

Updated Date - Aug 01 , 2025 | 08:08 PM