Drunk Snake Charmer: నడిరోడ్డుపై పాముతో హల్‌చల్.. లేడీ పోలీస్ పరుగో పరుగు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:57 PM
Drunk Snake Charmer: అతడి ఆగడాలు ఎక్కువవటంతో చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్లందరూ చుట్టుముట్టారు. దీంతో భయపడిపోయిన అతడు పామును సంచిలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాగిన మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పాముతో రోడ్డుపై అలజడి సృష్టించాడు. ఏకంగా పోలీసులనే పాముతో బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన పాములు పట్టే ఓ వ్యక్తి పీకల దాకా తాగాడు. చేతిలో పాముతో షాపుల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. పాముతో ఉన్న ఆ వ్యక్తిని చూసి షాపుల వారు భయపడిపోయారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. తాగిన మత్తులో అతడు రెచ్చిపోయాడు.
ఓ షాపులో కూర్చున్న వ్యక్తి మెడలో పామును చుట్టి భయపెట్టాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళుతున్న వారినీ పాముతో భయపెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడ్ని ఆపడానికి ప్రయత్నించిన ఓ లేడీ కానిస్టేబుల్‌పైకి పాము విసిరాడు. ఆ పాము దెబ్బకు ఆమె గుండె జల్లుమంది. భయంతో దూరంగా పరుగులు తీసింది. పాములు పట్టే వ్యక్తి బైకు దగ్గర ఉన్న మగ కానిస్టేబుల్ వైపు వెళ్లాడు. పామును చూడగానే ఆ మగ కానిస్టేబుల్ గుండెలో రైళ్లు పరిగెత్తాయి. ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.
అతడి ఆగడాలు ఎక్కువవటంతో చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్లందరూ చుట్టుముట్టారు. దీంతో భయపడిపోయిన అతడు పామును సంచిలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పాములు పట్టే వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్పామ్ మార్కెటింగ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఇలా చేయండి..
అరుదైన సంఘటన.. 30 ఏళ్లు పిండం.. ఇప్పుడు శిశువు