Yoga Day Celebration: యోగా చేసిన శునకం.. అచ్చం మనుషుల్లానే..
ABN , Publish Date - Jun 20 , 2025 | 09:19 PM
Yoga Day Celebration: ఓ వీధి కుక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసింది. అచ్చం మనుషుల్లా యోగా చేసింది. దాన్ని ఎవరూ బలవంతం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుంటే అది చూసింది.

ప్రపంచ వ్యాప్తంగా శనివారం యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే, యోగా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే దేశ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లోని ఉదమ్‌పూర్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ 13వ బెటాలియన్ క్యాంపస్‌లో శుక్రవారం ఉదయం యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటు ఓ ప్రత్యేక అతిధి కూడా యోగా కార్యక్రమంలో పాల్గొంది.
ఆ ప్రత్యేక అతిధి ఎవరో కాదు.. ఓ వీధి కుక్క.. ఓ వీధి కుక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసింది. అచ్చం మనుషుల్లా యోగా చేసింది. దాన్ని ఎవరూ బలవంతం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుంటే అది చూసింది. అది కూడా అక్కడి వచ్చింది. వారు ఏం చేస్తుంటే అదే చేయటం మొదలెట్టింది. మొత్తం 55 మంది ఎన్డీఆర్ సిబ్బంది అందులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత మందిని కాదని అందరి చూపు ఆ శునకం మీదకే వెళ్లింది.
ఇక, ఈ సంఘటనపై ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఓ వీధి కుక్క యోగా నేర్చుకోగలిగింది. మనుషులు ఎందుకు నేర్చుకోలేరు. ప్రతీ రోజు ఎందుకు యోగా చేయలేరు’ అని ప్రశ్నించారు. అయితే, ఆ వీధి కుక్కకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు సంవత్సరాలుగా యోగా నేర్పుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ శునకం యోగా చేసిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శునకం యోగాసనాలు చేయటంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..
స్పెషల్ ట్రైన్లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు